బాలు గురుంచి హస్పెటల్ డాక్టర్లు ఎం చెప్పారు


     (స్ప్రెడ్ న్యూస్ );-  బాలసుబ్రమణ్యం ఈరోజు మధ్యాహ్నం1గంట4 నిమిషా లకు పరమపదించిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఆగస్టు 4 నుండి ఎంజీఎం డాక్టర్లు ఈ రోజు దాకా ఆయన ప్రాణాల మీద ఎలాగైనా ప్రాణాలు కాపాడాలని సత విధాలుగా ప్రయత్నించినా బాలు ప్రాణాలు కాపాడలేకపోయాము  అని ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం పై కన్నుమూత పై స్పందించారు. తీవ్రమైన కోవిడ్ నిమోనియా కారణంగా ఆగస్టు 14 నుంచి క్రిటికల్ కేర్ ఇంట్లోనే ఉన్నారని, సెప్టెంబర్ 4న బాలు కి టెస్టింగ్ రిపోర్టులు నెగటివ్ గా వచ్చినప్పటికీ ఈ ఉదయం బాలు పరిస్థితి మరింత క్షీణించిందని.


     ప్రాణాలు కాపాడడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదని కార్డియో రెస్పిరేటరీ అరెస్టు కారణంగా మధ్యాహ్నం 1గంట4 నిమిషా లకు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం కన్నుమూసినట్లు ఎంజీఎం వైద్యులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాలసుబ్రమణ్యం 1946 జూన్ 11న నెల్లూరు జిల్లాలోని కోకోనేట్ అమ్మపేట గ్రామంలో ఒక సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన బాలుడు అనతికాలంలోనే చిత్రసీమలో ఘంటసాల తర్వాత సినీ పాటలకు అసలైన వారసుడు గా ఎదిగాడు.


    ఈ భారతదేశంలోని 40 వేల పాటలుపాడి  ప్రేక్షకులను ఉర్రూతలూగించిన బాలు, ఆరు జాతీయ అవార్డులతో పాటు,6 ఫిలింఫేర్ అవార్డును కూడా గెల్చుకున్నాడు.1996 లో పొట్టి శ్రీరాములు డాక్టరేట్ అందుకున్నాడు. 2011లో పద్మభూషణ్ అవార్డు, అనేక అవార్డులు అందుకున్న బాలసుబ్రమణ్యం. ఈ సినీ సంగీత అభిమానుల గుండెల్లో గాన గంధర్వుడుగా నిలిచిపోయాడు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా మన మనసుల్లో  ముఖ్యంగా తెలుగువారి మనసుల్లో చిరంజీవి లా మన మధ్యనే ఉంటాడు.