ఆంధ్రప్రదేశ్ లోఅమరావతి ఆట మొదలయ్యిందా!


     (స్ప్రెడ్ న్యూస్ );- ఆంధ్రప్రదేశ్ లో ఆట మొదలైందా,( గేమ్ స్టార్ట్ నౌ) అవును ఆంధ్రప్రదేశ్లో అవినీతి ఆట మొదలైనట్లు ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం టిడిపి ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి మీద ఎంక్వయిరీ చేస్తున్నారు. చేస్తున్న ఏ సి బి టీం కి సాక్ష్యాధారాలతో కేసులు పెడుతున్నట్లు తెలిసింది. దీంతో అదిరిపోయిన తెలుగు తమ్ముళ్లు కోర్టుకెళ్లి ముందస్తు బెయిల్ కోసం, అరెస్టు కాకుండా ఆర్డర్ కోసం,  హైకోర్టులో పిల్ దాఖలు చేస్తున్నారు. ఇటీవలే అమరావతి భూ కుంభకోణం కేసులో మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాసరావు పై ఏసి బి కేసు నమోదు. శ్రీనివాస పై ప్రివెన్షన్ కర్టెన్ 409, ఐసీసీ 420, రెడ్ విత్ 120బి, సెక్షన్లు  నమోదు చేశారు.


     మరో 12 మందిపై కేసు నమోదు చేశారు. చంద్రబాబు హయాంలో అడ్వకేట్ జనరల్  (ఏజీ)గా ఉన్న శ్రీనివాస్  అధికారిక హోదా లో ఉంటూ అక్రమాలకు పాల్పడినట్లు సాక్ష్యాధారాలు. నాలుగులో 2014లో మామ, బావమరిది, పేర్లతో భూములు కొనుగోలు చేసిన దమ్మాలపాటి. 2015 16 లో భూములు దమ్మాలపాటికి బదలాయింపు. అలాగే బాలకృష్ణ హిందూపూర్ ఎమ్మెల్యే బావమరిది, బావమరిదిసుమారు  500 ఎకరాలు కేవలం ఒక్క లక్ష కి అప్పజెప్పిన వైనం.నెంబర్ 93మార్కెట్ ర్యాలీ ప్రకారం ఒక్క లక్ష కి విక్రయించినట్లు జీవో నెంబర్ ఉంది.


    ఇటువంటివి అనేక విషయాలను అమరావతిలో భూముల విషయాలను అవినీతి జరిగినట్లు ఏసీపీ నిగ్గుతేల్చింది.  ఆధారాలతో పాటు దర్యాప్తు ప్రారంభమైంది. దీంతోపాటు ఇప్పుడు జగన్ వీటి మీద సి.బి.ఐ ఎంక్వయిరీ కి కేంద్రానికి లేఖ రాశారు. తెలుగుదేశం ప్రభుత్వం మటుకు భయపడి కేసులు లేకుండా హైకోర్టులో స్టే కోసం ప్రయత్నిస్తున్నారు. ఏమైనప్పటికీ ఆట ఆరంభం అయింది దీనికి ముగింపు ఎప్పుడో?