ఏపీ లో రైతుల పరిస్థితి చూస్తే చాలా బాధేస్తోంది


    ( స్ప్రెడ్ న్యూస్);-  వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉన్న రాష్ట్రం ఆంధ్ర ప్రేదేశ్ అని మన రాష్ట్రానికి రైతులు  వెన్నెముక లని 4 ఏళ్లు రెండంకెల వృద్ధిరేటుకు వ్యవసాయంలోమా ప్రభుత్వ పురోగతే కారణమన్న తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు  అన్నారు. రైతుల కోసం పాటుబడింది తెలుగుదేశం ప్రభుత్వమని.మా హయం లో రైతులు సుఖ సంతోషాలతో ఉన్నారని రైతుల కోసం అనేక కారక్రమాలు కొనసాగించామని అన్నారు.


    కానీ వైకాపా ప్రభుత్వ హాయాం లో మాత్రం రైతుల పరిస్థితి గోరంగా తయారైందని,రైతుల వెన్నువిరిచేశారని ఇపుడు కైనా ఏపీ ప్రభుత్వం నిద్ర నుండి మేల్కొని రాష్ట్ర రైతులను,అలాగా నెల్లూరు లో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని తొందరగా వాళ్లని ఆదుకోవాలని అన్నారు. ఇది చాలా అత్యవసర పనని వర్షాలతో రైతులు అలమటిస్తున్నారని వారి సమస్యలను తెలుసుకొని పరిష్యారించాలని ప్రతిపక్ష నాయకుడు  చంద్రబాబునాయుడుఅన్నారు.


    పుట్టి ధాన్యానికి రూ.16 వేల కనీస మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని కొలతలతో  మోసాలు జరగకుండా చూడాలని, దళారుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని పేర్కొన్నారు.రానున్నది టీడీపీ ప్రభుత్వమని రైతులందరూ సమస్వలను ఎదుర్కొని నిలబడాలని మన ప్రభుత్వం వచ్చినాక సమస్యలని పరిస్కసరిస్తానని  వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉన్న రాష్ట్రం మనఆంధ్రప్రేదేశ్ ని అదుకొంటామని అన్నారు.