ఏపియుడబ్ల్యూజే ఆధర్యంలో జర్నలిస్టుల నూతన అక్రిడిటేషన్ జీవోను రద్దు చేయాలని డిమాండ్


              (స్ప్రెడ్ న్యూస్ ) నెల్లూరు;- :ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నెల్లూరు జిల్లా  ఏపియుడబ్ల్యూజే శాఖ ఆధర్యంలో  ప్రతినిధుల బృందం మంగళవారం డీఆర్వొ రమణ, డివిజనల్ పీఆర్వో ఏ. రమెష్ లను కలసి  వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యుజే రాష్ట్ర కార్యదర్శి ఎ. జయప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అక్రిడిటేషన్ కమిటీ నియమాలను మారుస్తూ జారీ చేసిన ఉత్తర్వులపై కమిటీ విధి విధానాలపై అభ్యంతరాలు ఉన్నాయని అన్నారు.


           యూనియన్ ప్రతినిధులు ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను ఖండిస్తున్నామన్నారు .ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అర్ధరహితంగాఉన్నాయని,ఒక యూనియన్ నుంచి ముగ్గురు ప్రతినిధులను పంపటం నిరసిస్తున్నామన్నారు.ముగ్గురు ప్రతినిధుల్లో ఒక్కరిని ప్రభుత్వం ఎంపిక చేయడం ప్రజాస్వామ్య విధానాలకు తగ్గట్టుగా లేదన్నారు . 98 జీవోను వ్యతిరేకిస్తున్నామన్నారు.


        70 సంవత్సరాల చరిత్ర కలిగిన ఎపియుడబ్లూజె ను గుర్తించకపోవటం విచారకరం అన్నారు .ప్రభుత్వ అక్రిడిటేషన్ జీవోకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నామన్నారు. తక్షణమే జీవో ఉపసంహరించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు .ఈ కార్యక్రమంలో సామ్నాఅధ్యక్షుడు రామ్మూర్తి,ప్రధాన కార్యదర్శి జి.హనోక్,కోశాధికారి పి విజయ్కుమార్,వెంకటేశ్వర్లు,గోపినాధ్,వంశీ, అక్మల్ తదితరులు పాల్గొన్నారు.