ఈడీబీ ర్యాంకుల్లో ఏపీ ఫస్ట్ నిలవడాన్ని అభినందించిన కేంద్ర మంత్రి పీయూష్.
పోర్టుల ప్రగతికి సీఎం, మేకపాటి చొరవపట్ల కేంద్ర పరిశ్రమల మంత్రి విస్మయం.పారిశ్రామికాభివృద్ధే లక్ష్యంగా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఢిల్లీలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. రెండో రోజు ఢిల్లీ పర్యటనలోనూ కేంద్ర మంత్రులు , కార్యదర్శులతో వరుసగా సమావేశాలు నిర్వహించారు. కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రి మనుసుఖ్ మాండవీయ, కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ లను పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కలిశారు.రాష్ట్రాభివృద్ధికి, మౌలిక వసతుల కల్పన, కీలక ప్రాజెక్టులకు ఆర్థిక తోడ్పాడు అందించాలని మంత్రి గౌతమ్ రెడ్డి కోరారు.
తొలుత కేంద్ర ఆర్థిక సహాయ మంత్రిని కలిసిన మంత్రి మేకపాటి ఏపీలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయనున్న రెండు నైపుణ్య విశ్వవిద్యాలయాల స్థాపనకు ఆర్థికంగా సాయమందించాలన్నారు. ఏపీలో పర్యటించి..పారిశ్రామికవేత్తలను కలవాల్సిందిగా ఆర్థిక సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ ని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆహ్వానించారు. మంత్రి ప్రతిపాదనల పట్ల కేంద్ర మంత్రి సానుకూలతను వ్యక్తం చేశారు.కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయతో మంత్రి మేకపాటి భేటీ అయ్యారు.
కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సాగరమాల, భారతమాల ప్రాజెక్టులలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, పోర్టుల చుట్టూ జాతీయ రహదారుల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాలకు నిధులు మంజూరు చేయాలని, సాధ్యమైనంత ఆర్థిక తోడ్పాటు అందించాలని మంత్రి గౌతమ్ కేంద్ర మంత్రిని కోరారు.. ముఖ్యంగా మారిటైమ్ బోర్డు తీసుకురావడం వల్ల కోస్తా తీరం కేంద్రంగా 3 పోర్టులతో పాటు, 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టనున్నట్లు కేంద్ర మంత్రి మాండవీయకు మంత్రి గౌతమ్ రెడ్డి వివరించారు. మంత్రి కోరిన అంశాలలో ఏపీలో కేంద్రం భాగస్వామ్యంతో ఒక జాతీయ స్థాయి పోర్టు అభివృద్ధి జరగనుందని, కేంద్రం ద్వారా త్వరలో ఆ ప్రతిపాదనలు వచ్చిన అనంతరం సీఎంతో చర్చించి దీనిపై నిర్ణయిస్తామని మంత్రి మేకపాటి వెల్లడించారు.
(కొరవ పార్ట్ 2 లో )