స్ప్రెడ్ న్యూస్ (నెల్లూరు );- జర్నలిస్టులను ఆదుకోవటం ప్రభుత్వ బాధ్యతని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి జయప్రకాష్ అన్నారు .బుధవారం నెల్లూరు ప్రెస్ క్లబ్లో సామ్నా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5నెలల నుంచి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు వివిధ రకాల ఉద్యమాన్ని చేయడం జరిగిందన్నారు .జూలై 18న రాష్ట్రవ్యాప్తంగా 127 కేంద్రాలలో ప్రదర్శనలు నిర్వహించడం జరిగిందన్నారు .ఆగస్టు 17న ఏపియుడబ్ల్యూజే వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా 10932 మంది జర్నలిస్టులు ఆన్లైన్ ద్వారా కరోనా బాధితుల్ని ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
దేశవ్యాప్తంగా చాలా మంది మృతి చెందారని అందులో జర్నలిస్టులు కూడా ఉన్నారన్నారు .ఆరోగ్య సిబ్బందికి పోలీసులకు పారిశుధ్య కార్మికులకు కేంద్ర ప్రభుత్వం 50 లక్షల రూపాయలను బీమా ద్వారా అందజేస్తుందని అదే విధంగా జర్నలిస్టులకు కూడా అందజేయాలని మహాత్మాగాంధీ పుట్టిన రోజు అక్టోబర్ 2వ తేదీన దేశవ్యాప్తంగా ఉద్యమించడం జరిగిందన్నారు .ఈ పరిణామాలన్నీ దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఈ నెల 12 తేదీన అంతర్జాతీయ మీడియా సలహాదారులు దేవులపల్లి అమర్, ఐజెయు అధ్యక్షులు కె శ్రీనివాస్ రెడ్డి లు జరిపిన చర్చల్లో ముఖ్యమంత్రి కరోనాతో చనిపోయిన జర్నలిస్టులకు 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా మరియు జర్నలిస్టుల కుటీజముబాలకు ఇళ్ళు అందజేస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు.
జర్నలిస్టులకు సహాయ సహకారాలు అందిస్తానన్న ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి గారికి అందుకు కృషి చేసిన దేవులపల్లి అమర్ శ్రీనివాస రెడ్డిలకు జర్నలిస్టులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారన్నారు .గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక లావాదేవీలతో సంబంధం లేకుండా రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగిందని ప్రస్తుతం వాటిని తొలగిస్తున్నారని తక్షణమే జర్నలిస్టులకు తెల్లరేషన్ కార్డులు మంజూరు చేయాలని, వృద్ధాప్య పింఛన్లు అందజేయాలని, విద్య,వైద్యం జర్నలిస్టుల కుటుంబాలకు ఉచితంగా అందజేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా కోశాధికారి టి రమేష్ బాబు .సామ్నా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాటేటి రత్న ప్రసాద్, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సర్వే పల్లి రామ్మూర్తి ,జి .హనోక్ , గౌరవ అధ్యక్షుడు రామారావు, ఉపాధ్యక్షుడు సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు .