నెల్లూరు ఆర్టీసీ ప్రయాణికులకు కోవిడ్ 19 వ్యాధి నిర్ధారణ పరీక్షలు


     స్ప్రెడ్ న్యూస్(నెల్లూరు);- నెల్లూరు నగరంలోని RTC బస్టాండ్ ని శనివారం ఉదయం కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు సందర్శించారు. ఆర్.టి.సి. బస్సులలో ప్రయాణించే ప్రయాణికులకు కోవిడ్ 19 వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడానికి, బస్టాండ్ లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కోవిడ్ పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కలెక్టర్ అన్ లాక్ నిబంధనలు సడలించిన తర్వాత ఆర్.టి.సి బస్సుల ద్వారా జిల్లా కేంద్రం నుంచి గ్రామీణ ప్రాంతాలకు, ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు ప్రయానించే ప్రయాణికుల సంఖ్య పెరిగిందన్నారు. దీనివలన కరోనా వైరస్ అనుమానిత లక్షణాలు ఉన్నవారు, బస్సులలో ప్రయాణించే సమయంలో అనుమానం ఉంటే, వెంటనే నెల్లూరు ఆర్.టి.సి బస్టాండ్ లోని ఈ కేంద్రంలో పరీక్ష చేయించుకోవచ్చన్నారు. దీనివల్ల కోవిడ్ వ్యాప్తి నగరాల నుంచి గ్రామాలకు, గ్రామాల నుంచి నగరాలకు విస్తరించకుండా చర్యలు తీసుకోవచ్చన్నారు. ఆర్.టి.సి. బస్టాండ్ లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ప్రయాణికులు కోవిడ్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ తెలిపారు.


ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీ హరేంధిర ప్రసాద్,  DM&HO శ్రీమతి రాజ్యాలక్షి, ఆర్.టి.సి ఆర్.ఎం పి.వెంకటశేషయ్య, ఆర్.డి.ఓ శ్రీ హుస్సేన్ సాహెబ్, అధికారులు పాల్గొన్నారు.