అమరావతి లో రెండు ఉద్యమాలా


     స్ప్రెడ్ న్యూస్(అమరావతి);- అమరావతి లో మేము ఐదుకోట్ల ఆంద్రుల కోసం మా భూములను త్యాగం చేసాము అని ఒక వర్గము ఉద్యమము నడుస్తున్న సంగతి తెలుసు. ఈ ఉద్యమము 300 రోజులు దాటింది కానీ ఈ ఉద్యమానికి  అనుకొంటున్నత మద్దతు రాలేదు. ఈ లోపల ఏపీ సర్కార్ పేద ప్రజల కోసం భూమిని ఇళ్ల స్థలాల కోసం కేటాయుంచింది. దానిని ఎపుడైతే కోర్టులో ఆడుకొన్నారో వెంటనే మూడు రాజధానులకు అనుకూలముగా ఇంకొక ఉద్యమం పుట్టుకొచ్చి, రోజు రోజుకి ఉద్యమము బలపడుతున్నది.


     ఎవరైతే భూముల కోసం రైతులు పోరాడుతున్నారో అది ఎటువంటి ఇబ్బంది లేదు. మీ సమస్యల కోసం ఎంతవరకు అయినా పోరాడండి. అందరి మద్దతు ఉంటుంది, కానీ రాజకీయాలలో కలగ చేసుకోవద్దు, ప్రభుత్వ కార్య్రక్రమాలలో కలగచేసుకోవద్దు.ఈ ఏపీ రాష్ట్రాన్నిఅప్పుల ఊబిలోకి పోకుండా చేయండి.ఎవరైనా  మాటలాడుతాము కానీ డబ్బులు ఇవ్వలేము ఉద్యమాన్ని అపి ప్రభుత్వానికి సహకరించండి.


    అక్కడి దరలలో ఏ ఒక్క సామాన్యుడు సైతం కొనగలిగే అవకాశమే లేదు.అక్కడి భూమి నల్లరేగడి కనుక అక్కడ ప్రవేట్ వ్యక్తులు నిర్మించే నిర్మాణాలకు కేవలం 11 అంతస్తుల వరకు మాత్రమే అనుమతులు ఇస్తారు. అంతకు మించి నిర్మించడానికి అనుమతులు ఇవ్వరు.మూడు పంటలు పండే మంచి భూమిని నాశనం చేసి అంత అప్పు చేసి ప్రజలపై భారం వేసి ఆమరావతి నిర్మించడం అవసరమా.నిజమైన అభివృద్ధి తో కూడుకున్న మన రాష్ట్రంలో రాజధాని మనకు కావాలి.


    కలల రాజధానిని వదిలేసి ఐదు కోట్ల ఆంధ్రుల అవసరాల రాజధాని కోసం అడుగు ముందుకు వేయండి. పేదలకు, ప్రజాప్రతినిధులకు అక్కడ చోటు లేనప్పుడు అది "పెద్దల రాజధాని" అవుతుంది గాని"ప్రజా రాజధాని" ఎలా అవుతుంది. అందుకే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి జరగాలని అడుగులు వేస్తున్న, జగన్ గారి నిర్ణయానికి జై కొడదాం.ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి లో భాగమవుదాం.