రెడ్ క్రాస్ సంస్థ వారి సేవలు అమోగం


     స్ప్రెడ్ న్యూస్(నెల్లూరు);- కోవిడ్ నివారణ చర్యలలో రెడ్ క్రాస్ సంస్థ వారు, వాలంటీర్లను నియమించి ఎనలేని సేవలందించారన్నారు. ప్లాస్మా దానంలో కూడా జిల్లా దేశంలోనే మెరుగైన స్థానంలో ఉందన్నారు. యువకులు ముందుకు వచ్చి ప్లాస్మా దానం చేశారని, ప్లాస్మా దానం చేసిన వారికి సీఎం గారు ప్రోత్సాహకంగా రూ.5,000 ప్రకటించారని, దానిని వెంటనే అందించామన్నారు. 900 యూనిట్ల ప్లాస్మాని సేకరించామని, చికిత్స ద్వారా కోవిడ్ పాజిటివ్ వ్యక్తుల ప్రాణాలు రక్షించామన్నారు.


     జిల్లాలో 95 శాతం రికవరీ రేట్ తో 59,876 మంది ఇప్పటికీ చికిత్స తీసుకుని ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వెళ్లారన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారికి కూడా చికిత్స అందించామన్నారు. హోం ఐసోలేషన్ అవకాశం లేని వారికి 3000 పడకలతో కోవిడ్ కేర్ సెంటర్లలో పౌష్టికాహారం, వైద్యం అందించామన్నారు. వైద్య ఆరోగ్య శాఖ,  సచివాలయ సిబ్బంది, పోలీసు, రెవెన్యూ సిబ్బందితో పాటు.., అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు 24 గంటలూ వారియర్స్ లా పనిచేశారన్నారు.


    1077 కంట్రోల్ రూం ద్వారా కాల్స్ రిసీవ్ చేసుకుని కోవిడ్ పాజిటివ్ వ్యక్తులను చికిత్స అందించామన్నారు. మనం- మన పరిశుభ్రత కార్యక్రమం ద్వారా గ్రామాల్లో కోవిడ్ నివారణ చర్యలు తీసుకుంటున్నామని, ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. రాబోయో రోజుల్లో కోవిడ్ ఆస్పత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లలోని సిబ్బంది ఇదే విధంగా నిబద్ధతో సిబ్బంది పనిచేయాలన్నారు. మాస్కులు తప్పక ధరించాలని,సోషల్ డిస్టెన్స్ పాటించాలన్నారు.


    రాష్ట్రంలో మొట్టమొదటి కోవిడ్ రహిత జిల్లాగా చేయాలని చర్యలు తీసుకుంటున్నామన్నారు. జాయింట్ కలెక్టర్ శ్రీ ఎన్.ప్రభాకర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ శ్రీ హరేంధిర ప్రసాద్ సహకారంతో కోవిడ్ నివారణ చర్యలలో కీలకపాత్ర పోషించారని వారిని ప్రత్యేకంగా కలెక్టర్ అభినందించారు. కోవిడ్ మహమ్మారి నివారణ చర్యలలో పాల్గొంటూ వైద్యులు, నర్సులు, పోలీసు సిబ్బంది మరణించారని, వారి కుటుంబాలకు ప్రగాడ సంతాపం వ్యక్తం చేస్తున్నాన్నారు. వారి కుటుంబాలు త్వరిత గతిన 50 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అందిస్తామన్నారు.