లక్ష రూపాయలు మీకు కావాలా

 



లక్ష రూపాయలు మీకు కావాలా ఈ షార్ట్ ఫిల్ములో విజయం తో లక్ష మీ స్వంతం 


    స్ప్రెడ్ న్యూస్ (విజయవాడ);- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లఘు చిత్రాల పోటీల కొరకు దరఖాస్తుల ఆహ్వానం.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లఘు చిత్రాల నియమ నిబంధనలను అనుసరించి 2020వ సంవత్సరానికి గాను  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లఘు చిత్రాల పోటీల కొరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన “నవరత్నాలు” అభివృద్ది పధకాలపై  తెలుగు భాషలో 3 నుండి 5 నిమిషాల వ్యవధిలో లఘు చిత్రo నిర్మించిన వ్యక్తులు / సంస్థల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. 


    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లఘు చిత్రాల నియమ నిబంధనలనలతో పాటుగా దరఖాస్తుల కొరకు మా సంస్థ వెబ్ సైట్ www.apsftvtdc.in ను చూడగలరు. దరఖాస్తులను ఆన్ లైన్లో పొందుపరచగలరు.  పూర్తి చేసిన దరఖాస్తుతో పాటుగా చిత్రీకరించిన లఘు చిత్రo యొక్క కంటెంట్ ను DVD/USB(Pen Drive)/Blu-ray ఫార్మాట్లలో సంబంధిత ఫారాలతో జతపరచి మా సంస్థకు పంపుటకు చివరి తేది: 14 డిసెంబర్, 2020  గా నిర్ణయిస్తూ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకటక జారీచేయడ మైనది....... మేనేజింగ్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర టి.వి. మరియు నాటకరంగ అభివృద్ది సంస్థ, విజయవాడ, తేది: 17.10.2020.


మొదటి బహుమతి -100000
రెండవ బహుమతి -  50000(ఇద్దరికి )
మూడవ బహుమతి-25000(ముగ్గురికి )
ఆఖరి తేదీ -20-12-2020
ఎంట్రీ ఫీజ్ -1000