స్ప్రెడ్ న్యూస్ ;- .న్యాయవ్యవస్థ ఇప్పుడు ప్రమాదంలో పడింది. కాబోయే ప్రధాన న్యాయమూర్తి మీద అవినీతి ఆరొపణలు రావడం చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం. ఏకంగా ముఖ్యమంత్రి లేఖ రాయడం అనేది పరిస్థితి ప్రభావాన్ని తెలియజేస్తుంది. ఇలాంటి సంఘటనలు న్యాయ వ్యవస్థ నిజాయతీని ప్రశ్నార్థకం చేస్తాయి. వీటిని చూసీచూడనట్టు వదిలేయలేం. ఒక పార్టీ ప్రయోజనాలు కాపాడేందుకు రాష్ట్ర హైకోర్టు తీర్పుల్లో సుప్రీం న్యాయమూర్తి తలదూర్చడం, అందుకు ప్రతిఫలంగా భూములు పొందారనే ఆరోపణలు న్యాయ వ్యవస్థకు ఎంత మాత్రం మంచిది కాదు. లెటర్ పబ్లిక్‌లోకి రావడం కరెక్టా కాదా అనేది ఇక్కడ అప్రస్తుతం. ఆరోపణలు వచ్చినప్పుడు విచారణకు సిద్దం కావాలి. ఇలాంటి ఆరోపణలపై ఖచ్చితంగా విచారణ జరపాలి. సుప్రీం కూడా ఈ అంశాన్ని చూసి వదిలేస్తుందని నేను అనుకోవడం లేదు.ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పలేను కానీ.. ఖచ్చితంగా విచారణకు ఆదేశిస్తుందని భావిస్తున్నాను. ఇండియా టుడే డిబేట్ లో ఏకే గంగూలీ, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి అన్నారు.