కాకాణి ఎత్తుకు - సోమిరెడ్డి చిత్తు


     స్ప్రెడ్ న్యూస్ (నెల్లూరు);- ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని సోమిరెడ్డి.., లావాదేవీలు సజావుగా జరిగాయని కాకాణి గత కొద్దిరోజులుగా విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్న సందర్భంలో ధాన్యం కొనుగోళ్లు వివరాలను బయట పెడితే, అధికార పార్టీ బండారం బయట పడుతుందని సోమిరెడ్డి వ్యాఖ్యానించడంతో స్పందించిన ఎమ్మెల్యే కాకాణి పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, సోమిరెడ్డి డిమాండ్ ను అంగీకరించి, ధాన్యం కొనుగోళ్లు లావాదేవీల వివరాలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు బృందం చేత నేరుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి పంపించి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారికి అందించి, సోమిరెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడ అవినీతి జరిగిందో నిరూపించాలని సవాల్ విసిరారు.



    ధాన్యం కొనుగోళ్లలో వచ్చిన విమర్శలు పట్ల ఏ ఒక్కరికి అనుమానం ఉండకూడదని భావించి, తెలుగుదేశం పార్టీతో పాటు సి.పి.ఎం., సి.పి.ఐ., బిజెపి, కాంగ్రెస్ కార్యాలయాలకు కూడా ధాన్యం కొనుగోలు వివరాలను అందించి, పరిశీలించవలసిందిగా కోరారు.ఈ ఏడాది ఎడగారు సమయంలో కరోనా లాంటి అనేక సమస్యలు వచ్చినా, రైతాంగానికి ఇబ్బందులు లేకుండా చేశాము.అన్ని విషయాలలో రైతులకు అండగా ఉంటూ, చేయూతనందిస్తున్నా, తెలుగుదేశం నాయకులు మాత్రం అనవసరంగా విమర్శలు చేస్తున్నారు. రైతులకు మద్దతు ధర కోసం నిరసన తెలియజేస్తే, పోలీసులు కేసులు పెడితే, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్లి, రైతులపై పోలీసు కేసులు ఎత్తివేయిస్తే తెలుగుదేశం వాళ్లకు వచ్చిన నష్టమేంటో తెలియడం లేదు!.


"సోమిరెడ్డికి రెండు  ఆప్షన్స్"


    ఆప్షన్ 1: గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని రైతురథంలో అవినీతి, రైతులను మోసం చేసి మిల్లర్ల వద్ద ముడుపులు తీసుకోలేదని కాణిపాకం వినాయకుని వద్ద సోమిరెడ్డి ప్రమాణం చేస్తాడా...!


ఆప్షన్ -2: సోమిరెడ్డి వస్తే, అతని సమక్షంలో  సోమిరెడ్డి మిల్లర్ల వద్ద ముడుపులు తీసుకున్నాడని, రైతు రథంలో అవినీతికి పాల్పడ్డాడని, అవినీతి పరుడని, నేను ప్రమాణం చేయడానికి సిద్ధం...


సోమిరెడ్డికి ధైర్యం ఉంటే నా సవాలను స్వీకరించాలి...సోమిరెడ్డీ... నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏరోజైనా అభియోగాలు వచ్చినప్పుడు విచారణ జరిపించుకున్నావా...!రైతాంగ శ్రేయస్సు కోసం పనిచేస్తున్న మా నాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారిపై సోమిరెడ్డి కాదు ఎవరు విమర్శలు చేసినా ఊరుకునే ప్రసక్తే ఉండదు.సోమిరెడ్డి.. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే ఎవరూ పట్టించుకోరు అనుకుంటున్నావేమో, గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో ఉన్నన్ని రోజులు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డిని గారిని విమర్శిస్తే..తాట తీస్తా...