స్ప్రెడ్ న్యూస్ ;- ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని ఏపీ ప్రభుత్వం తమకు సహకరించడం లేదని ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏకంగా హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి గౌతమ్‌రెడ్డిస్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపైకీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి పరిస్థితుల్లోస్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేమని చెప్పారు డిసెంబర్‌లోపు కరోనా సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉందన్న మంత్రి గౌతమ్ రెడ్డి ఏ వైరస్ అయినా రెండు, మూడు సార్లు వస్తుందని తెలిపారు. నవంబర్, డిసెంబర్ పరిస్థితిని చూసి అప్పుడు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
అప్పటి వరకు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేమని ఆయన వెల్లడించారు.ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలకు కొంత వెసులుబాటు ఉంటుందని గౌతమ్ రెడ్డి తెలిపారు.ఈనెల 28న అన్ని రాజకీయ పార్టీలతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమావేశం. మరోవైపు గతంలో జరిగిన ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి కొత్తగా మళ్లీ ప్రారంభించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఎస్‌ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ ఎస్‌ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని జగన్ సర్కార్ తప్పు పట్టింది. ఈ వ్యవహారం అనేక మలుపులు తిరిగి కోర్టు తీర్పు ఆయనకు అనుకూలంగా రావడంతో, మళీ ఆయన ఎస్‌ఈసీగా బాధ్యతలు చేపట్టారు.ఇటీవల హైకోర్టులో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన పిటిషన్‌పై విచారణ జరిగింది. కరోనా కారణంగా ఎన్నికలు నిర్వహించలేమని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు.