ఇదీ జగనన్న పాలన


     spread news;- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి  దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 5 సంవత్సరాల పాలనలో రాష్ట్రంలోని జలాశయాలను ఎలాగైతే నిండా యో, అదేవిధంగా జగనన్న పాలనలో రెండో సంవత్సరం కూడా రాష్ట్రంలోని జలాశయాలన్ని పూర్తిగా నిండాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి శ్రీ. పి. అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.ప్రస్తుతం కండలేరు జలాశయం లో 53 టీఎంసీల రికార్డు స్థాయిలో నీటి నిల్వ ఉందని దానిని 60 టి.ఎం.సి లకు నీటిని నిల్వ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని,  కండలేరు బ్యాక్ వాటర్ వల్ల ముంపు ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రైతాంగ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నామని ఆయన అన్నారు.



అధికారులు అప్రమత్తంగా ఉండేలా ఆదేశాలు జారీ చేశామని, కండలేరు జలాశయం కింద ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలను తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. జిల్లాలో ప్రతి గ్రామానికి తాగునీరు సాగునీరు అందిస్తామని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా తెలుగుగంగ, సోమశిల, కండలేరు జలాశయ అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. కండలేరు   జలాశయాన్ని పర్యటించిన మంత్రి శ్రీ. పాలు బోయిన అనిల్ కుమార్ యాదవ్ గారితో పాటు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీ. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే శ్రీ. కిలివేటి సంజీవయ్య, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, విజయ డైరీ ఛైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, రాపూరు మండలానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త శ్రీ.బండి వేణుగోపాల్ రెడ్డి, కండలేరు, సోమశిల, తెలుగు గంగ అధికారులు  పాల్గొన్నారు.