దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర రైతులకు ఆర్థిక సహాయం


     spreadnews;- వైయస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌’ రెండో విడత చెల్లింపులు.క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కడం ద్వారా రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌.మొత్తం 50.47 లక్షల రైతుల ఖాతాల్లో దాదాపు రూ.1,115 కోట్లు జమ.రాష్ట్రంలో ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి సహాయంగా ఏటా రూ.13,500 చెల్లిస్తున్న ప్రభుత్వం, వరసగా రెండో ఏడాది కూడా ఆ పథకాన్ని అమలు చేసింది. రెండో ఏడాదిలో తొలి విడత సహాయాన్ని గత మే నెలలో అందించిన ప్రభుత్వం, మలి విడతలో రబీ సాగుకు పెట్టుబడిగా మంగళవారం ఆ సహాయం చేసింది. 


ఈ అవకాశం దేవుడిచ్చాడు:


    ఇవాళ అరకోటికి పైగా రైతులకు దాదాపు రూ.6800 కోట్లు సహాయంగా అందిస్తున్న ఈ పథకం, వైయస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ పథకం.నిజంగా కొన్ని పథకాలు చేసినప్పుడు చాలా సంతోషాన్ని ఇస్తాయి. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు.. 50 లక్షల రైతుల కుటుంబాలకు మేలు జరుగుతోంది. రాష్ట్రంలో దాదాపు 1.50 కోట్ల ఇళ్లుంటే, వాటిలో 50 లక్షల ఇళ్లకు మేలు అంటే, మూడో వంతు ఇళ్లకు మేలు కలుగుతోంది.


    ఈరోజు ఒక లబ్ధిదారుడికి కానీ, రైతుకు మంచి అన్నది జరగాలి. అంటే ఎక్కడా కూడా వివక్ష లేకుండా, అవినీతి లేకుండా, పూర్తిగా శాచురేషన్‌ పద్ధతిలో కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతాలు చూడకుండా, రాజకీయాలు చూడకుండా, పార్టీలు చూడకుండా చెప్పిన మాట ప్రకారం తూచ తప్పకుండా ప్రతి పథకం అమలు. ప్రతి అర్హుడికి కూడా మేలయ్యే విధంగా నేరుగా ఈ రైతు భరోసా సొమ్మును బటన్‌ నొక్కిన వెంటనే నేరుగా వారి బ్యాంక్‌ ఖాతాల్లో జమ అవుతుంది.