స్ప్రెడ్ న్యూస్ (నెల్లూరు);- ఏందయ్యా ఇది చంద్రమోహన్ రెడ్డి ఇది మాపై బురద బురదజల్లేది గూడ రాకుంటే ఎట్లాగయ్యా. బురదజల్లే ప్రయత్నానికి దళితుడైన జైపాల్ అనే వ్యక్తి ని వాడుకుని దళితులను అవమానించటం మీ పార్టీ పనా, అని నెల్లూరుజిల్లా వైసీపి అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు.సోమిరెడ్డి తన వ్యక్తిగత సహాయకుని ద్వారా ఓ లెటర్ పంపి దాన్ని జైపాల్ తో కలెక్టర్ కు ఇప్పించారన్నారు.లెటర్ ఉన్న ఆరోపణలు చూసి జైపాలే ఆశ్చర్యపోయారని, తాను ఆ ఆరోపణలు చేయలేదని సాక్షాత్తూ పోలీసులకు తెలియజేసినట్లు కాకాణి తెలియజేశారు.పోలీస్ స్టేషన్ లో రైతు జైపాల్ ఆరోపణలు చేసిన వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణలకు సంభందించిన వీడియోలను కాకాణి చూపెంచారు. ఇది తెలిసి రైతు జైపాల్ నోరు విప్పితే సోమిరెడ్డి అసలు ఉద్దేశ్యం బయటపడుతుందనే భయంతో టిడిపి నేతలకు ఫోన్ చేసి స్టేషన్ ముట్టడి చేస్తారా అని కాకాణి మండి పడ్డారు. తనకు చదువు రాదని, తాను ఎవ్వరి మీదా ఆరోపణలు చేయలేదని, విచారణలో జైపాల్ స్పష్టం చేసినట్లు కాకాణి తెలియజేశారు. ఇకనైనా దళితులను వాడుకోవటం మానాలని, ధాన్యం కొనుగోళ్లలో సోమిరెడ్డి కుట్ర ఉందన్న అనుమానం తమకుందని, రైతుల విషయంలో పూర్తి స్థాయి విచారణ జరిపి అసలు దోషులను బయట పెట్టాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను గోవర్ధన్ రెడ్డి కోరారు.