స్ప్రెడ్ న్యూస్(మరావతి);- నవంబర్ లో 'ఇండస్ట్రీస్ స్పందన' ప్రారంభం : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.ప్రజలు, పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులకు మరింత దగ్గరగా పరిశ్రమల శాఖ.ఏ సమస్యకైనా సత్వరమే పరిష్కారం దిశగా పరిశ్రమల శాఖ అడుగులు.వెబ్ సైట్ ప్రారంభంతో మరింత చేరువ, జవాబుదారీ, పారదర్శకత.పరిశ్రమలకు సంబంధించిన ఎలాంటి సందేహం, ఫిర్యాదైనా సత్వరమే స్పందన..స్పష్టత కూడా.
ఉన్నతాధికారులతో వెలగపూడి సచివాలయంలోని మంత్రి ఛాంబర్ లో రివ్యూ మీటింగ్.
పరిశ్రమల శాఖకు సంబంధించిన ప్రత్యేక 'స్పందన' వెబ్ సైట్ ప్రారంభం, ఈడీబీ, పరిశ్రమల నీటి అవసరాలు, ఎస్ఐపీసీ, ఎస్ఐపీబీపై చర్చ.పరిశ్రమలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 'గ్రీవెన్స్' స్వీకరించేలా రూపకల్పన.ఫిర్యాదు, సమస్య సబ్ మిట్ మీట నొక్కిన వెంటనే ఫిర్యాదుదారుడికి మెసేజ్ వచ్చే సౌలభ్యం.ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, వైఎస్ ఆర్ ఏపీ వన్ లను కూడా చేర్చాలని మంత్రి ఆదేశం.ఫిర్యాదు స్వీకరణ, పరిష్కారం తదితర పరిణామాలపై ఫిర్యాదుదారుడి ద్వారా 'ఫీడ్ బ్యాక్' వెసులుబాటుకు చోటు.పారిశ్రామిక, పెట్టుబడిదారులకు ఇండస్ట్రీస్ వర్చువల్ ఎంట్రిప్రూనర్ డిజిటల్ అసిస్టెన్స్ .
చాట్ బోట్ సౌకర్యంలో 'వేద' పేరుతో ఉన్న యానిమేషన్ బొమ్మ ద్వారా ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు.బొమ్మల తయారీ పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని మంత్రి చర్చ.విశాఖ, గోదావరి జిల్లాలలో బొమ్మల తయారీ పరిశ్రమలకు పెద్దపీట.అందుబాటులో ఉన్న భూములను బట్టి ముందుగానే కొంత భూమిని ఉంచాలని ఆదేశంఏపీ బొమ్మల తయారీ బోర్డు' ఏర్పాటు చేయాలని మంత్రి మేకపాటి ఆదేశం.కడపలోని కొప్పర్తి కేంద్రంగా ఎమ్ఎస్ఎమ్ఈ పార్కు ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న మంత్రి మేకపాటి.పరిశ్రమలకు కావలసిన నీటి అవసరాలకు సంబంధించి డీపీఆర్ తయారు దిశగా సమాలోచన.ఏపీ టెక్స్ట్ టైల్స్, గార్మెంట్స్ పాలసీ 2018-23 ఆపరేషనల్ గైడ్ లైన్స్, ఐఎస్ బీతో భాగస్వామ్యం పై ఆరా.
పరిశ్రమల శాఖపై సమీక్షకు హాజరైన పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి, పరిశ్రమల శాఖ సలహాదారు శ్రీధర్ లంకా, ఐ.టీ శాఖ సలహాదారులు శ్రీనాథ్ రెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, లోకేశ్వరరెడ్డి, తదితరులు.ఎక్స్ పోర్ట్ లపై పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ.