ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసం వద్ద అలజడి


     స్ప్రెడ్ న్యూస్( అమరావతి);- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసం వద్ద అలజడి రేగింది. సిఎం జగన్ ఇంటి వద్దకు వెళ్ళే మార్గంలో రోడ్డు కుంగిపోయింది. దీనితో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఆ రోడ్డు మార్గం ద్వారానే సిఎం జగన్ ఇంటికి వెళ్తారు. ఆ ప్రాంతంలో రోడ్డు కుంగిపోవడంతో వెంటనే అధికారులు నివారణా చర్యలు చేపట్టారు. వర్షాల ధాటికి ఈ పరిస్థితి వచ్చింది అని అధికారులు చెప్పారు. ప్రస్తుతం అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు చెప్తున్నారు.మూడు నుంచి నాలుగు అడుగుల మేర రోడ్డు కుంగింది అని అధికారులు చెప్పారు. పోలీసులు అటు వైపు రాకపోకలు నిలిపివేశారు. వెంటనే చర్యలు చేపట్టడమే కాకుండా భవిష్యత్తులో అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.