స్ప్రెడ్ న్యూస్ ;- 2014 నుంచి 2016 వరకు రెండు సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి చంద్రబాబు ఖర్చు చేసింది 265 కోట్లు మాత్రమే.2014 తర్వాత పెరిగిన అంచనాలను చెల్లించమని 2017లో కేంద్ర కేబినెట్ స్పష్టం చేసింది.అప్పటి కేంద్ర కేబినెట్‌లో టీడీపీకి చెందిన ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు. సవరించిన అంచనాలను అంగీకరించమని కేబినెట్ నిర్ణయం తీసుకున్నప్పుడు టీడీపీ మంత్రులు ఎందుకు వ్యతిరేకించలేదు.Sep 30 , 2016లో ఆర్థికమంత్రి కార్యాలయం ఒక లేఖ విడుదల చేసింది. 2014 వరకు ఇరిగేషన్ కాంపోనెంట్ వరకు ఎంత ఖర్చు అవుతుందో అంత వరకే ఇస్తామని లేఖలో ఉంది.
నీతి అయోగ్ వైస్ చైర్మన్ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు పోలవరం ప్రాజెక్టు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది అని చెప్పారు.ప్రాజెక్టును మేమే కట్టేస్తాం.. మాకే అప్పగించండి అని చంద్రబాబు కోరడంతో ప్రాజెక్టును 2013–14 రేట్ల ప్రకారం కేవలం ఇరిగేషన్ కాంపోనెంట్ వరకే అప్పగించేందుకు నిర్ణయం తీసుకుంటున్నామని స్పష్టంగా ఆర్థిక శాఖ నుంచి లేఖ విడుదల చేశారు.కేంద్రం విడుదల చేసిన లేఖకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపిందా అంటే అదీ లేదు.
అప్పటి ప్రతిపక్ష నేత, మా నాయకుడు వైయస్ జగన్ దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేసినా.. లేదు లేదు మాకు ప్యాకేజీ ముఖ్యం, మేమే నిర్మిస్తామని చంద్రబాబు తీసుకున్నారు.2018లో ప్రధాని నరేంద్రమోడీకి చంద్రబాబు లేఖ రాశారు. 2014 అంచనా రేట్లను తొందరగా అప్రూవ్ చేసి మాకు ఆ డబ్బు ఇచ్చేయండి మేము ప్రాజెక్టు నిర్మించుకుంటామని రాశారు.53 శాతం పనులు పూర్తిచేశామని ఒకపక్క అంటూనే.. దీంట్లో రూ.8 వేల కోట్లు ఖర్చు చేశామని అన్నారు. 8 వేల కోట్లు ఖర్చు చేసి 53 శాతం పూర్తయిందని చెబితే.. ప్రాజెక్టు వాల్యూ కేంద్ర ప్రభుత్వం చెప్పిన రూ.20 వేల కోట్లు లోపు అవుతుంది తప్ప.. మీరు చెప్పినట్లుగా 55 వేల కోట్లు కాదు.
టీడీపీ ఈ రోజు సిగ్గులేకుండా మా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తోంది. మీరు చేసిన తప్పును మాపై రుద్దుతారాకేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్టును చంద్రబాబు ఎందుకు తీసుకున్నారు, ప్రతి సోమవారం పోలవరంలో చంద్రబాబు ఏం పరిశీలించారు, లక్ష మంది నిరాశ్రయ కుటుంబాల గురించి ఎందుకు ఆలోచించలేదు, ప్రాజెక్టు నిర్వాసితులను కచ్చితంగా ఆదుకోవాల్సిందే.ఈ విషయాలన్నింటిపైనా త్వరలో ప్రధాని మోదీని కూడా కలుస్తాం. ఆ మేరకు పోలవరంపై కేంద్రానికి సీఎం వైయస్ జగన్ లేఖ కూడా రాస్తారు.