కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో సంస్కరణల దిశగా సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ సమీక్ష


     స్ప్రెడ్ న్యూస్ (అమరావతి);- మున్సిపాలిటీల ఆదాయం స్థానికంగానే వ్యయం చేయాలి.ఆ డబ్బును ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడదు.స్వయం సమృద్ధి దిశగా మున్సిపాలిటీలు అడుగులు వేయాలి.ఆ ఉద్యోగుల జీత భత్యాలను ప్రభుత్వమే చెల్లిస్తుంది.మున్సిపాలిటీలలో శానిటేషన్‌ పక్కాగా ఉండాలి.వాటర్, సీవరేజీ కూడా సక్రమంగా నిర్వహించాలి.పారిశుద్ధ్యం విషయంలో ఎక్కడా రాజీ వద్దు.మున్సిపాలిటీలలో సంస్కరణలపై సమీక్షలో సీఎం.


     కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, సిఫార్సులకు అనుగుణంగా పట్టణ స్థానిక సంస్థలు (యూఎల్‌బీ) అయిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో చేపట్టవలసిన సంస్కరణలపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. ప్రజలకు మెరుగైన సేవలందించడంతో పాటు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు మరింత అభివృద్ధి చెందే విధంగా ఒక ఎస్‌ఓపీ రూపొందించాలని సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఆదేశించారు. వీధులనూ పరిశుభ్రం చేయాలి, డ్రైనేజీలను తరుచూ క్లీన్‌ చేయాలి.


     మున్సిపాలిటీలలో ఆదాయం ఎంత? వాటి వ్యయం ఎంత? జీతాల కోసం ఎంత ఖర్చు చేస్తున్నారు? అభివృద్ధి పనులకు ఎంత వ్యయం చేస్తున్నారు? వంటి అన్నీ తెలుసుకుని, ఇంకా ఏం చేస్తే బాగుంటుందన్న దానిపై ఎస్‌ఓపీ రూపొందించండి.ప్రజలకు ఇంకా మెరుగైన సేవలందించడంతో పాటు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందే విధంగా ఆ ఎస్‌ఓపీలు ఉండాలి. శానిటేషన్‌, వాటర్‌ అండ్‌ సీవరేజ్‌కు సంబంధించి రోజువారీ నిర్వహణ వ్యయాన్ని (ఓ అండ్‌ ఎం) మాత్రమే ఛార్జీలుగా వసూలు చేయాలి.