స్ప్రెడ్ న్యూస్ (నెల్లూరు );- విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ కళాశాలలో ఈ రోజు (15.10.2020) జరిగిన రెండవ మరియు నాల్గవ సెమిస్టర్ ఉదయం పరీక్షల్లో మొత్తం 11275 మంది విద్యార్థులు గాను 10123 మంది విద్యార్థులు హాజరు అయినారు. ఈ పరీక్షలకు 1152 విద్యార్థులు గైర్హాజరు అయినారు మరియు మధ్యాహ్నం జరిగిన పరీక్షల్లో మొత్తం 12528 మంది విద్యార్థులు గాను 10987 మంది విద్యార్థులు హాజరు అయినారు 1541 మంది విద్యార్థులు గైర్హాజరు కాగా ఈఎస్‌ఎస్ డిగ్రీ కాలేజ్ వెంకటగిరి నందు ఒక విద్యార్ధి డీబార్ అయినారు. ప్రతి పరీక్షా కేంద్రంలో ప్రభుత్వం వారు నిర్దేశించిన ప్రకారం కోవిడ్ -19 నిబంధనలను పాటిస్తూ విద్యార్థులను పరీక్షా కేంద్రం లోనికి అనుమతించడం జరిగింది, ప్రతి పరీక్షా కేంద్రంలో మాస్కులు ను తప్పనిసరి చేస్తూ భౌతిక దూరం పాటిస్తూ పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. నెల్లూరు , కావలి మరియు గూడూరు డివిజన్ల లో మూడు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు పరిశీలిస్తున్నారని, ప్రతి పరీక్షా కేంద్రం లో ఒక పరీక్షల పరిశీలకుడిని నియమించడం జరిగింది.
డా .సి.యస్.సాయిప్రసాద్ రెడ్డి
(పరీక్షల నిర్వాహణాధికారి)