spread news ;- కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా పలు సర్వీసులు రద్దు. వాటిలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రవాణా వ్యవస్థ కు సంబందించి బస్సులు ఆగిన సంగతి అందరికి తెలుసు. ప్రవేట్ బస్సులు యధావిధిగా కొనగిస్తున్నారు. ప్రభుత్వ బస్సులు, ఇప్పటికీ కొనసాగడం లేదు. బస్సు సర్వీసులు తిరగడానికి ఇప్పటికే రెండు రాష్ట్రాల ఆర్టీసి ఆధికారులు భేటీ అయ్యి చర్చలు జరిపారుతెలంగాణ సర్కార్ మాత్రం ఇప్పుడు సర్వీసులు తిరగడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు.
.ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ బస్సులు ప్రతి రోజు తెలంగాణలో 2.60 లక్షల కిలో మీటర్ల మేర తిరుగుతాయి.తెలంగాణకు చెందిన ఆర్టీసీ బస్సులు ఏపీలో 1.66 లక్షల కిలో మీటర్ల మేర తిరుగుతాయి.ఏపీ బస్సులు తెలంగాణలో లక్ష కిలోమీటర్లు అదనంగా తిరుగుతున్నాయని, దీన్ని తగ్గించుకుని అంతర్రాష్ట్ర పర్మిట్లు తీసుకోవాలని తెలంగాణ ఆర్టీసీ ఉన్నతాధికారులు వెల్లడించారు.తెలంగాణ సర్కార్ మాత్రం సర్వీసులను తిప్పడానికి వెనకడుగు వేస్తుంది.
ఏపి బస్సులను 50 వేల కిలో మీటర్లు తగ్గించుకుంటామని , తెలంగాణ సర్వీసులు మరో 50 వేల కిలోమీటర్లు పెంచుకుంటే చాలని చెప్పారు ఏపి లో తిప్పడానికి వారి దగ్గర బస్సులు లేవని కొంటె సాకు చెప్పారు.ఆంధ్రప్రదేశ్ అధికారులు లక్ష కిలో మీటర్లు తగ్గించుకుంటామని సూచించారు. ఈ దశలోనే తెలంగాణ ఆర్టీసీ అధికారులు కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. హైదరాబాద్ టూ విజయవాడలో మాత్రమే బస్సులను తిప్పాలని, మిగితా ప్రాంతాల్లో అవసరం లేదని చెప్పారు.ఈ పద్దతి ఆర్టీసీ అధికారులకు మింగుడు పడలేదు. ఇది జనం సమస్య ప్రజలు ప్రవేట్ బస్సులతో సమస్యలు వస్తాయని అధికారులు చెబుతున్నారు.