అంతకంతకు పెరుగుతున్న మద్దతు


     స్ప్రెడ్ న్యూస్ ;- ఈనెల ఆరో తేదీన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ SA బాబ్దే గారికి, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు అమరావతి భూముల కుంభకోణం ఫై విచారణను ఏపీ హైకోర్టు అడ్డుకోవడం సరికాదనిలేఖ రాయడం దానిని సీనియర్ ఐఏఎస్ అధికారి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజేయ కల్లం ప్రెస్ మీట్ లో బహిర్గతం చేయడం దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు తెర లేచింది న్యాయవ్యవస్థ లోని లోపాల కలుగు కదిలించిన జగన్కు అంతకంతకు పెరుగుతున్నమద్దతు.


    తాజాగా మద్రాస్ హైకోర్టు ప్రముఖ సీనియర్ న్యాయవాది శ్రీరాం పంచు, తాను హిందూ ఆంగ్ల పత్రికలో రాసిన వ్యాసంలో 70 ఏళ్ల భారత దేశ చరిత్రలో ప్రజల గొంతు నొక్కే ఇంతటి దుర్మార్గమైన గాగ్ ఆర్డర్ ఏపీ హైకోర్టు ఇవ్వడం న్యాయ వ్యవస్థకు చెడ్డ పేరు తెచ్చిందని అన్నారు.. న్యాయ, పాలనా వ్యవస్థలు పరస్పరం ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటున్న సమయంలో, ప్రజల్లో వ్యవస్థ ప్రక్షాళన చేసి తీరాలన్న డిమాండ్ పుట్టుకు వచ్చింది.అజేయ కల్లం గారు సూచించిన విధంగా ఆర్టికల్ 233, 235 ప్రకారం,జిల్లా జడ్జీల నియామకం కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు రాష్ట్ర గవర్నర్లు మాత్రమే చేయాలి.


    దేశ వ్యాప్తంగా జడ్జీల పై విచారణ కోరుతూ, జగన్ రాసిన లేఖను సమర్థిస్తూ జాతీయ స్థాయిలో మీడియా ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ లాంటి పేరున్న పత్రికలు వ్యాసాలు రాశాయి.జస్టీస్ ఏకే గంగూలీ, రెడ్డప్ప రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, ప్రశాంత్ భూషణ్, మాడభూషి శ్రీధర్, ఉండవల్లి అరుణ్ కుమార్, వంటి న్యాయ నిపుణులు ప్రొఫెసర్ నాగేశ్వర్, తెలకపల్లి రవి, కృష్ణం రాజు, తిలక్ లాంటి విశ్లేషకులు, లోకసత్తా నేత జయప్రకాష్ నారాయణ లాంటి ప్రముఖులు జగన్ గారికి మద్దతు తెలుపు తున్నారు.


జగన్ గారి లేఖకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ చేసిన తీర్మానాన్ని చైర్మన్ దుష్యoత్ దవ ఖండించడం, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్ర బార్ అసోసియేషన్ నేతలు జగన్ గారికి అనుకూలంగా నిలబడటం శుభ పరిణామం.