నెల్లూరు జిల్లా ప్రజలకు శుభవార్త


       స్ప్రెడ్ న్యూస్ ( నెల్లూరు);-  ఆరోగ్యశ్రీ కార్డు క్రింద 2వేల వ్యాధులకు చికిత్స అందిస్తానని నవరత్నాల భాగంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట ఇచ్చిన సంగతి తెలిసిందే.ఆమాట కోసం13 జిల్లాలకి గాను ఏడు జిల్లాల్లో అమలు అవుతున్న సంగతి అందరికి తెలుసు. మిగిలిన ఆరు జిల్లాలకు నవంబర్‌ 13 నుంచి అమలు కాబోతున్నది ఇపుడు ఈ ఆరు జిల్లాలలో నెల్లూరు జిల్లా ఉందిఇది తప్పకుండా నెల్లూరు జిల్లాప్రజలకు శుభవార్త. 


    నవంబర్‌ 13 నుంచి నెల్లూరు జిల్లా ప్రజలు ఆరోగ్యశ్రీ కార్డుతో 2000 వ్యాధులకు చికిత్స చేసుకోవచ్చు . 1000రూపాయలకు ఎక్కువైతే ఆరోగ్యశ్రీ కార్డు క్రింద ప్రభుత్వమే భరిస్తుంది . మరిన్ని వైద్య ప్రక్రియలను చేర్చేందుకు పరిశీలన.హెల్త్‌ క్లినిక్స్‌ వచ్చేవరకూ ఆరోగ్యశ్రీ రిఫరల్‌ పాయింట్లుగా గ్రామ, వార్డు సచివాలయాలుముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ కీలక ఆదేశాలు. వైద్య ఆరోగ్య రంగంలో నాడు– నేడుపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.


    ఆస్పత్రుల నిర్వహణ లో అత్యుత్తమ ప్రమాణాలు ఉండాలి:ప్రతి అంశానికీ బాధ్యులు ఉండాలి.ఆస్పత్రిలో పరికరాల దగ్గరనుంచి ఏసీల వరకూ కూడా ప్రతిదీ  సక్రమంగా పనిచేయాలి.వాటి నిర్వహణ బాగోలేదనే మాట రాకూడదు.ప్రభుత్వఆస్పత్రులకు వచ్చే రోగులకు సౌకర్యాల విషయంలో ఎలాంటి ఇబ్బంది రాకూడదు.ఆస్పత్రుల్లో శానిటేషన్, పరిశుభ్రత విషయంలో రాజీపడొద్దు.జనరేటర్లు పనిచేయడం లేదు, ఏసీలు పనిచేయడంలేదు, శుభ్రత లేదు, శానిటేషన్‌ లేదనే మాట ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదు.కార్పొరేట్‌ ఆస్పత్రులతో దీటుగా ఉండాలి.


ఆరోగ్యశాఖమంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని తదితర అధికారులు హాజరు.