స్ప్రెడ్ న్యూస్ (దొనకొండ );- మరల దొనకొండ పై ప్రభుత్వ దృష్టి ఎందుకు, ఏపీకి క్యాపిటల్ ప్రాంతం కాబోయు కొద్దిగా తప్పించుకున్నదొనకొండ, ప్రకాశం జిల్లాలో ఉన్న సంగతి అందరికి తెలిసిందే. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం, అమరావతి రాజధాని గా ప్రకటించడం తో దొనకొండ క్రమక్రమంగా కనుమరుగైంది. దొనకొండ రాజధాని అవుతుందని ఎంతోమంది అక్కడ భూములు కొన్నారు. వాళ్ల పరిస్థితి ఏమైంది, అగమ్యగోచరం అయింది. ఏదో విధంగా అమ్ముకుని బయటపడ్డారు.
ఇప్పుడు దొనకొండ పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాజధానిగా కాదు గత ప్రభుత్వ హయాంలో కారిడార్ ఏర్పాటుకు చర్యలు చేపట్టడంతో వార్తల్లో నిలిచింది .తదుపరి కనుమరుగైంది. ప్రస్తుతం ఏవి డిఫెన్స్ కేంద్రాలు, ఏర్పాటు సోలార్ ప్రాజెక్టుకు, వైసీపీ ప్రభుత్వం చర్యలు చేపట్టడంతోఈసారైనా అభివృద్ధి పూర్తిస్థాయి అడుగులు పడతాయని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. కొండ ప్రాంతాల్లో 50 వేల ఎకరాల ప్రభుత్వ భూమి. వైసీపీ ప్రభుత్వం ఇక్కడ జాతీయ స్థాయి పరిశ్రమలు నెలకొల్పేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
దీంతో దొనకొండ మరొకసారి మహర్దశ పట్ట పోతుంది తాజాగా దొనకొండ కేంద్రంగా డిఫెన్స్ క్లస్టర్ లో ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దీంతో ప్రకాశం జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 4వేల కోట్లతో ప్రారంభమయ్యే ఈ ప్రాజెక్టు ఏడాదిలోపు పూర్తి చేసి, వచ్చే సంవత్సరం లోనే విద్యుత్ ఉత్పత్తి చేయనున్నట్లు సమాచారం.ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉద్యోగాలు లభిస్తాయి ప్రత్యక్షంగా పదివేల మందికి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దొనకొండ ను అభివృద్ధి చేసి వెనకబడిన ప్రకాశం జిల్లా ని అభివృద్ధి పథంలో నడపటంసంతోషమని ప్రకాశం జిల్లా వాసులు అంటున్నారు.