స్ప్రెడ్ న్యూస్;- ఆరోపణలు కాదు, ఆధారాలతో కూడిన లేఖ గౌరవ చీఫ్ జస్టిస్ గారికి రాయడం జరిగింది.ఇక్కడ న్యాయవ్యవస్థను ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపించలేదు.2010 నుండి కూడా ఆయన కోర్టులను గౌరవించి ఆయన మీద ఉన్న కేసులనిమిత్తం ఆయన కోర్టుకు హాజరవుతూవస్తున్నారు.ప్రతీ శుక్రవారం కోర్టులను గౌరవించి ఆయన కోర్టుకు హాజరవుతూ వస్తున్నారు.ఇక్కడ ఆయనను ఒక వ్యక్తిగా చూడవద్దు,ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి.
ఆయనకున్న ఆధారాలను బట్టి ఆయనకు ఉన్న వ్యధను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి తెలియచేయడం జరిగింది.ఇది ఎంతమాత్రం శాసనవ్యవస్థకు న్యాయవ్యవస్థను మధ్య పోరాటం కాదు.చట్టపరిదిలోనే ఆయన వ్యవహరించారు,ఆయనపై ఉన్న కేసులగురించి ఎంతమాత్రం కాదు.మార్చ్ 21 నుండి కోర్టులు బంద్ అయ్యాయి,బార్ అండ్ బెంచ్ లు క్రియాశీలకంగా పనిచేయాలి.ప్రజలకోరకు పనిచేసే వారి కొరకు బార్ అసోసియేషన్లు పని చేయాలి కానీ,వారికి అడ్డు పడొద్దు.
తెలంగాణా ప్రభుత్వం మరియు ఆంద్రప్రదేశ్ మాత్రమే న్యాయవాదులకు కోవిడ్ రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది.సుప్రీంకోర్టు లో మేము తెలంగాణా అయినా ఆంద్రప్రదేశ్ తరుపున మేము పోరాడుతాము,ఎందుకంటే సమస్య మంచిది అయినప్పుడు మేము సహకరిస్తాము.ఏది ఏమైనా మనకు సమస్య పరిస్కారం ముఖ్యం ఆధారాలతో కూడిన లేఖ గౌరవ చీఫ్ జస్టిస్ గారికి రాయడం జరిగింది.కావున న్యాయం చేయాల్సిన అవసరము ఉంది.