spread news(vijayawada) ;- విజయవాడలో కొత్తగా నిర్మించిన కనకదుర్గ ఫ్లైఓవర్‌తో పాటు, బెంజి సర్కిల్ ఫ్లైఓవర్ ప్రారంభం.వర్చువల్ విధానంలో తాడేపల్లి క్యాంప్ ఆఫీసు నుంచి సీఎం శ్రీ వైయస్ జగన్ హాజరు, నాగపూర్ నుంచి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా ప్రారంభం.రూ.15,592 కోట్ల విలువైన 61 హైవే ప్రాజెక్టులకు సంబంధించి, 1411 కి.మీ పొడవైన రహదారుల నిర్మాణం కోసం ఈ-శిలాఫలకాల ఆవిష్కరణతో పాటు, వాటిని జాతికి అంకితం.ఢిల్లీ నుంచి వర్చువల్‌గా పాల్గొన్న రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ సహాయ మంత్రి రిటైర్డ్ జనరల్ వీకే సింగ్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంనుంచి రాష్ట్ర మంత్రులు ఎం.శంకరనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నానితో పాటు, రహదారులు భవనాల శాఖకు చెందిన పలువురు సీనియర్ అధికారులు హాజరు.