spread news;- రాఘవాచారిగారు నేటి యువ జర్నలిస్టులకు ఆదర్శప్రాయుడని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి జయప్రకాశ్ అన్నారు.బుధవారం రాఘవాచారి మొదటి వర్ధంతి కార్యక్రమం నెల్లూరు ప్రెస్క్లబ్లో నిర్వహించారు .ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాఘవాచారిగారు ఒక జర్నలిజానికి స్ఫూర్తి ఆదర్శప్రాయుడని కొనియాడారు. సుదీర్ఘకాలం ఒకే పత్రికల్లో ఎడిటర్గా నిర్వహించటంతోపాటు వేలాదిమందికి జర్నలిజంలో మెలకువలు నేర్పిన మహోన్నత వ్యక్తి అని అన్నారు.సమాజంలో పత్రికలు లోని నైతిక విలువలను కాపాడటంలో ఆయన అగ్రగణ్యుడని కొనియాడారు.
రాఘవాచారి చిత్రపటాన్ని ప్రెస్క్లబ్లో ఈ సందర్భంగా ఆవిష్కరించారు.ప్రథమ వర్ధంతి ప్రెస్క్లబ్లో ఘనంగా నిర్వహించారు .ఈ సందర్భంగా సి.పి.ఐ.జిల్లా కార్యదర్శి సి.హెచ్.ప్రభాకర్, మాట్లాడుతూ రాఘవాచారి ఒక విజ్ణాన ఘని అని ,అపర మేధావి అని ఆయన తెలుగు పత్రికా రంగాన్ని విశాలాంధ్ర దినపత్రిక ద్వారా , జాతీయ స్థానంలో గుర్తింపు తీసుకుని వచ్చిన మహోన్నతమైన వ్యక్తి అని కొనియాడారు .అంతటి మహోన్నతమైన వ్యక్తి ని గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రెస్ అకాడమీ కి రాఘవాచారి పేరును పెట్టడం నిజంగా అభినందించదగిన విషయం అని అన్నారు.నేటి తరం పాత్రికేయులు రాఘవాచారి గారి రచనలను చదివి జర్నలిజం యొక్క విలువలను కాపాడాలవలసిన బాధ్యత వారి పై ఉందని అన్నారు.
సి.పి.ఐ.సీనియర్ నాయకులు వి.రామరాజు మాట్లాడుతూ , రాఘవాచారి పలు బాషలలో మేధా సంపత్తి కలిగిన మహోన్నతమైన వ్యక్తి అని , అటువంటి మహోన్నతమైన వ్యక్తి ఆశయాలను నేటి తరం జర్నలిస్టు లు పూర్తిగా తీసుకుని కొనసాగించవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.విశాలాంధ్ర బ్యూరో దయాశంకర్ మాట్లాడుతూ రాఘవాచారి లాంటి ఎడిటర్ వద్ద పనిచేయడం తన అదృష్టం గా భావిస్తున్నానని , నేడు జర్నలిజంళో ఓనమాలు నేర్చుకున్నామంటే వారి నేర్పిన విధ్యేనని ,అటువంటి మహోన్నతమైన వ్యక్తిని కోల్పోవడం భాధాకరమని అన్నారు. భగవన్ సింగ్ , రత్నప్రసాద్ , హనూక్ , గణపతి రావు, శ్రీనివాసులు ,సి.పి.ఐ నాయకులు వాటంబేటి నాగేంద్ర , ఆదినారాయణ , తదితరులు పాల్గొని రాఘవాచారి గారికి ఘనంగా నివాళులు అర్పించారు.