స్ప్రెడ్ న్యూస్;- టర్కీలోని ఇజ్‌మిర్ నగరములో భారీ భూకంపం, బహుళ అంతస్తులు నేల కూలాయి. శిథిలాల కింద వందలాది మంది. పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి.ఇజ్‌మిర్ నగరంలో భూకంప ధాటికి కూలిన ఓ భవనం వద్ద శిథిలాల కింద చిక్కుకున్న తన యజమాని కోసం ఓ శునకం ఆరాటటం. నోరు లేని ఆ మూగ జీవి యజమాని ప్రాణాల కోసం ఆరాటపడుతున్న దృశ్యాలు అందర్నీకంటతడిపెట్టిస్తున్నది. శునకం వెక్కి వెక్కి ఏడ్చుతోంది.అటు ఇటు తిరుగుతూ,యజమాని చేతిని చూస్తూ తన ఆవేదనను వెలిబుచ్చుతోంది. అక్కడ్నుంచి కదలకుండా విశ్వాసంతో అక్కడే ఉండిపోయింది ఆ శునకం. భారీ భూకంపం ఇజ్‌మిర్ నగరానికి తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది.