నెల్లూరు జిల్లా ఫోటో జర్నలిస్టు అసోసియేషన్ నూతన కార్యవర్గానికి అభినందన


     స్ప్రెడ్ న్యూస్ (  నెల్లూరు );- సృజనాత్మకకు ప్రతిరూపం ఫోటోగ్రఫి అని నెల్లూరు మొదటి పట్టణ పోలీస్ స్టేషన్కు చెందిన సర్కిల్ ఇన్స్పెక్టర్ మధుబాబు అన్నారు .ఆదివారం నెల్లూరు ప్రెస్ క్లబ్లో నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్టు అసోసయేషన్ అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్త వ్రాసే విలేకర్ల కన్నా ఫొటో జర్నలిస్టుల ప్రాధాన్యత అధికంగా ఉంటుందన్నారు .ప్రపంచ వ్యాప్తంగా ఫోటోగ్రాఫర్లకు అపూర్వమైన విలువ ఉందని ఆయన కొనియాడారు .సమాజంలో జరుగుతున్నటువంటి వివిధ సమస్యలను ఫోటో ద్వారా వెలికి తెచ్చే వీలుందన్నారు .నూతన కమిటీని ఆయన అభినందించారు .ఈ సందర్భంగా ఎన్నికైన నూతన సభ్యులను ఎపియుడబ్లూజె రాష్ట్ర కార్యదర్శి జయప్రకాష్ అధ్యక్షులు వి వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి ఎం చంద్రశేఖర్ ఘనంగా సన్మానించారు. .ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్టు జిల్లా అసోసియన్ అధ్యక్షులు మాల్యాద్రి సీనియర్ ఫొటో జర్నలిస్ట్లు విక్రమ  జైన్ ఎస్కే ముజాహిద్ దేవసహాయం కోదండపాణి ఎం వెంకటరావు జాకీర్ తదితరులు పాల్గొన్నారు.


ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్టు జిల్లా అసోసియన్అధ్యక్షులు మాల్యాద్రి సీనియర్ ఫొటో జర్నలిస్ట్లు విక్రమ  జైన్ ఎస్కే ముజాహిద్ దేవసహాయం కోదండపాణి ఎం వెంకటరావు జాకీర్ మరియు సబ్యులకు తెలుగు మా పాఠకుల తరుపున అభినందనలు.