spread news(amravathi);- విజయవాడలోని బీ ఆర్ అంబేడ్కర్ స్వరాజ్ మైదాన్‌లో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుపై సీఎం శ్రీ వైయస్ జగన్ సమీక్ష.విజయవాడ స్వరాజ్ మైదాన్‌లో ఏర్పాటు చేయనున్న భారీ అంబేడ్కర్ విగ్రహం,స్మృతివనంకు సంబంధించి రెండు రకాల ప్లాన్లను పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో చూపిన అధికారులు. నాగపూర్‌లోఉన్న అంబేడ్కర్ దీక్ష భూమి,ముంబైలో ఉన్న చైత్య భూమి,లఖ్‌నవూలోని అంబేడ్కర్ మెమోరియల్ నోయిడాలోని ప్రేరణాస్థల్‌ను చూపించిన అధికారులు.
గ్యాలరీ, ఆడిటోరియమ్ ఎలా ఉంటుందన్న దానిపైనా అధికారుల ప్రజెంటేషన్.పనులు మొదలు పెట్టిన 14 నెలల్లో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించామన్న అధికారులు.అంబేడ్కర్ స్మృతివనంలో ఏర్పాటు చేసే విగ్రహం దీర్ఘకాలం నాణ్యంగా ఉండాలని, స్ట్రక్చర్‌లో మెరుపు, కళ తగ్గకుండా ఉండాలని ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్ జగన్ పేర్కొన్నారు.ల్యాండ్‌స్కేప్‌లో గ్రీనరీ బాగా ఉండాలని, అది ఏ మాత్రం చెడిపోకుండా చూడాలని ఆయన ఆదేశించారు.
అంబేడ్కర్ స్మృతివనం వద్ద లైబ్రరీ, మ్యూజియమ్, గ్యాలరీ ఏర్పాటుతో పాటు, ఆయన జీవిత విశేషాలు ప్రదర్శించాలని నిర్దేశం.అంబేడ్కర్ సూక్తులను కూడా ప్రదర్శించాలని సూచన.అదే విధంగా పార్కు వద్ద రహదారిని విస్తరించి, ఫుట్‌పాత్‌ను కూడా అభివృద్ధి చేయాలని, రెండింటిని ఆకర్షణీయంగా తీర్చి దిద్దాలన్న సీఎం.పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికాల వలవన్‌తో పాటు, పలువురు అధికారులు హాజరు.