ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమాలు


     spread news;- ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉదయం 8.55 నిమిషాలకు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో జరిగే కార్యక్రమానికి హాజరై, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. “మా తెలుగు తల్లికి” గీతాలాపన అనంతరం జాతీయ పతాకం ఆవిష్కరించి ముఖ్యమంత్రి జెండా వందనం చేశారు.  తదనంతరం తెలుగు తల్లికి నమస్కరించి, అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులుఅర్పించారు.


    పోలీసుల గౌరవ వందనం అనంతరం, జిల్లా కలెక్టర్లు, ఎస్సీలతో నిర్వహించే  వీడియో కాన్ఫరన్స్ లో పాల్గొని ప్రసంగించారు.సదరు రాష్ట్ర స్థాయి వేడుకలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల మంత్రులు, జిల్లా ఇన్చార్జి మంత్రులు, జిల్లా కలెక్టర్లు మరియు ఎస్సీలువీక్షించారు . ఈ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత ఆయా జిల్లాలలో జిల్లా స్థాయి కార్యక్రమాలుప్రారంబమైనాయి.


    జిల్లా మంత్రులు అందుబాటులో లేనిపక్షంలో జిల్లా ఇన్చార్జి మంత్రులు ఆయా జిల్లాలలో జెండా వందనం స్వీకరించారు.న్యూఢిల్లీలోని ఏపీ భవన్ నందు రెసిడెంట్ కమిషనర్ పోలీస్ అధికారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. జెండా వందనం స్వీకరించిన తర్వాత, అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు అర్పించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంబమైనాయి.