పోలవరంప్రాజెక్టు ఎత్తు తగ్గింపా?

 


  (spread news)  పోలవరం కీలక పనులపై సీఎం సమీక్షయుద్ధ ప్రాతిపదికన పనులు చేయాలని అధికారులకు సీఎం ఆదేశం.మే చివరినాటికి కాఫర్‌ డ్యాం పనులు పూర్తిచేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశం.స్పిల్వే, అప్రోచ్‌ఛానల్, అప్‌స్ట్రీం కాఫర్‌ డ్యాం, ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం, గేట్ల అమరిక తదితర కీలక పనులపై సీఎం  సమీక్షపోలవరం నిర్మాణంలో గత ప్రభుత్వ తప్పిదాలవల్ల పనులకు ఇబ్బందులు ఏర్పడ్డాయని సమావేశంలో ప్రస్తావన స్పిల్‌ వే పూర్తికాకుండా, కాఫర్‌ డ్యాం నిర్మాణం వల్ల ఇబ్బందులు వచ్చాయని ప్రస్తావన.

     ఒక పద్ధతి ప్రకారం కాకుండా.. అక్కడక్కడా అరకొరగా పనులు చేసి వదిలిపెట్టారని చర్చ.గతంలో కాఫర్‌ డ్యాంలో ఉంచిన ఖాళీల కారణంగా వరదల సమయంలో సెకనుకు సుమారు 13 మీటర్లు వేగంతో వరద ప్రవాహం వచ్చిందని తెలిపిన అధికారులు.దీనివల్ల ఈసీఆర్‌ఎఫ్‌డ్యాం వద్ద  గ్యాప్‌ 1, గ్యాప్‌ 2 లలో  భారీ ఎత్తున కోతకు గురైందని తెలిపిన అధికారులు.ఫలితంగా వరదల సమయంలో స్పిల్‌ఛానల్‌ పనులకూ తీవ్ర ఆటంకం ఏర్పడిందన్న అధికారులు.ఈ పనులు అన్నింటిపైనా ఇప్పుడు ప్రత్యేక దృష్టిసారిస్తున్నామని సీఎంకు వివరించిన అధికారులు.

     స్పిల్‌వే పనులు పూర్తయ్యాయని సీఎంకు తెలిపిన అధికారులు.గేట్లు, సిలిండర్ల బిగింపు చురుగ్గా సాగుతోందని వెల్లడించిన అధికారులు.స్పిల్‌ ఛానల్, అప్రోచ్‌ఛానల్‌ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని సీఎం ఆదేశం.మే నెలాఖరు నాటికి కాపర్‌ డ్యాం పనులను పూర్తి చేస్తామన్న అధికారులు.పోలవరం సహాయపునరావాస కార్యక్రమాలపైనా సీఎం సమీక్ష.పోలవరం ఎత్తు తగ్గింపుపై పత్రికల్లో వచ్చిన కథనాలు, ఆ కథనాలను పట్టుకుని చేస్తున్న దుష్ప్రచారంపై సమావేశంలో చర్చ.అసలు అలాంటి అవకాశమే లేదని స్పష్టంచేసిన అధికారులు