రాష్ట్రంలో అధికారం లో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇక దేశ రాజకీయాలలో కేంద్రంతో ఢీ కొట్టి ప్రతిపక్ష పాత్ర పోషించబోతున్నదా అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు. రాజ్యసభలో తాజాగా వైసిపి అనుసరిస్తున్న వ్యూహాలు కూడా అవును అనిపిస్తున్నాయి. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యవహారమే వైసిపి కేంద్రంతో ఢీ కొట్టడానికి ప్రధాన కారణం. ఇటీవలే ప్రత్యేక హోదా ఖరాఖండీగా చెప్పటం, పోలవరం విషయంలో కూడా ఇబ్బంది పెట్టడం. విభజన హామీల వైపు అడుగులు వేయకపోవడం. ఇవన్నీ కూడా వైసిపికి కేంద్రంతో ఢీ కొట్టడానికి కారణాలు.
ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వమునకు అనుకూలంగా వ్యవహరించిన వైసిపి. ఒకానొక సమయంలో ఎన్డీఏ ప్రభుత్వంలో, కేంద్ర క్యాబినెట్ లో చేరుతున్నట్టువార్తలు వచ్చాయి. తాజాగా వైసిపి పార్టీ రాజ్యసభ సభ్యులు, రాజ్యసభ నుంచి రెండోసారి వాకౌట్ చేయడం జరిగింది.ఢిల్లీ ముఖ్యమంత్రి క్రేజీవాల్ కి బాసటగా జగన్ సర్కార్ రాజ్యసభ నుంచి వాకౌట్ చేసింది. దేశంలోనే అతిపెద్ద నాలుగో రాజకీయ పార్టీగా వైసిపి ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, ఇన్నాళ్లు మెతక వైఖరిని అనుసరించిన వైసిపి పార్టీ. ఎప్పుడైతే స్టీల్ ప్లాంట్ కేంద్రాన్ని అమ్మకానికి పెట్టిందో అప్పటినుండి విధివిధానాలను మార్చుకుని, రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని విజ్ఞప్తులు చేసినా 100%ప్రైవేటీకరణకు మొగ్గు చూపటంతో కేంద్ర ప్రభుత్వంతో ఢీ కొనడానికి సిద్ధమైనట్లు సమాచారం. ప్రతిపక్ష పార్టీలను కలుపుకొని ముందుకు పోతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా నా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ బాగుండాలని ఆశిద్దాం.