తిరుపతి ఎంపీ బరిలో జగన్ మాస్టర్ ప్లాన్


 ఇటీవల జరిగిన ఎన్నికలలో అఖండ మెజారిటీతో గెలిచి, మంచి ఊపు మీదున్న వైఎస్ఆర్ పార్టీ అదే ఊపులో తిరుపతి ఎన్నికలలో కూడా అఖండ మెజారిటీ దిశగా దూసుకుపోతుంది. దీనికి తగ్గట్లే  జగన్ 7+7+ 2 వ్యూహంతో ముందుకు పోతున్నారు. గతంలో నంద్యాలకు జరిగిన ఉప ఎన్నికలలో క్యాబినెట్ మొత్తం బరిలో ఉన్నారని ఆరోపించిన జగన్, అలాంటి విమర్శలు చేయకుండా, జగన్ కూడా ప్రచార బరిలోకి దిగకుండా, మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. తిరుపతి అసెంబ్లీ 7సెగ్మెంట్లలో ఏడు మంది మంత్రులకు బాధ్యత ఇచ్చారు.

      ఏడు మంది మంత్రులు, మంత్రులకు ఏడు మంది ఎమ్మెల్యేలు, రంగంలోకి దిగనున్నారు. వీరికి టీటీడీ చైర్పర్సన్ సుబ్బారెడ్డి, మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఊహ కర్తలుగా  నియమించారు. మంత్రులలో తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్కు పేర్ని నాని, సత్యవేడు కొడాలి నాని, సులూరుపేట మంత్రి కన్నబాబు, సర్వేపల్లి ఆదిమూలపు సురేష్, వెంకటగిరి మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి,  శ్రీకాళహస్తి గౌతమ్ రెడ్డి, పూర్తి బాధ్యతలు అప్పగించారు. గత ఎన్నికలలో బల్లి దుర్గాప్రసాద్2 లక్షల 20 వేల మెజార్టీతో గెలిస్తే, ఇప్పుడు భారీ వ్యూహంతో తిరుపతి లో రికార్డులు తిరగరాసే  వ్యూహంతోజగన్ ముందుకు పోతున్నారు.