గిరిజన గృహాలకు అచరిత్వ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ

     


 దువ్వూరివారిపాలెంలో ఇటీవల జరిగిన సిలిండర్ పేలి బూడిదైపోయిన 11 గిరిజన గృహాలను అచరిత్వ ఫౌండేషన్ సభ్యులు దర్శించి నిరాశ్రయులైన కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందజేసి ఓదార్పునిచ్చారు. ప్రతికుటుంబానికి 10 కేజీల బియ్యం,కందిపప్పు, నూనె ప్యాకెట్లు,ఉప్పు,  పసుపు,చింతపండు లాంటి ఆహార వస్తువుల్ని అందజేశారు. ఈ సందర్భంగా అచరిత్వ ఫౌండేషన్ ఛైర్మన్, స్కౌట్ మాస్టర్ పి జి డి కృపాల్ మాట్లాడుతూ  అన్నీ గృహాలు పూర్తిగా కాలిపోయి బూడిదైపోయాయని ,వారంతా ప్రాణాలతో బయటపడడం నిజంగా వారి అదృష్టమని వారితో కలిసి విషయాలు చర్చించినప్పుడు తన కళ్ళు చెమ్మగిళ్లాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మలా మేరీ,పాస్టర్ జేమ్స్, మస్తాన్, క్రిమన్ బాబు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.