ఎలాంటి అవకతవకలు జరగలేదువిక్రమ సింహపురి యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ విజయ్ కృష్ణ రెడ్డి గారు


 విక్రమ సింహపురి యూనివర్సిటీ లో ఎలాంటి అవకతవకలు జరగలేదని, సాంకేతిక లోపం వల్లే అలా జరిగిందని విక్రమ సింహపురి యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ విజయ్ కృష్ణ రెడ్డి గారు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ సాయి ప్రసాద్ రెడ్డి తెలిపారు. నెల్లూరు నగరంలోని విక్రమ సింహపురి యూనివర్సిటీ అతిథిగృహంలో ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కొన్ని విద్యార్థి సంఘాలు ఆరోపించినట్లు పరీక్షల ఫలితాల వెల్లడిలో ఎలాంటి అవినీతి జరగలేదన్నారు. సాంకేతికంగా ఏర్పడిన లోపాన్ని మాత్రమే పరిష్కరించామన్నారు. కొంతమంది విద్యార్థి సంఘాలు తమ వ్యక్తిగత జెండాతో పనిచేస్తూ విక్రమ సింహపురి యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నరని  విమర్శించారు. ఈ కార్యక్రమంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ సాయి,పి ఆర్ ఓ నీలమణీ కంట, సహాయక రిజిస్ట్రార్ సుజాయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.