నగరి ఎమ్మెల్యే రోజా డిశ్చార్జ్ రోజా ఆలోచన అంతాఎక్కడ?

 


 చెన్నై అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయున రోజా,చెన్నై అపోలో ఆసుపత్రి లొరెండు మేజర్ శస్త్ర చికిత్సల కోసం జాయిన్ అయిన రోజా. పది రోజుల పాటు హాస్పిటల్ లోనే గడపాల్సి వచ్చింది. రోజా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయున తరువాత‌ ఆమె మాట్లాడుతూ తాను ఆసుపత్రిలో ఉన్నా ఇంట్లో ఉన్నా తన ఆలోచన అంతా వైసీపీ గెలుపు మీదనే ఉంటుందని పేర్కొన్నారు. ఆమెను భర్త ఆర్కేసెల్వమణి, కుమార్తె అన్షుమాలిక, కుమారుడు కృష్ణకౌశిక్, కుటుంబ సభ్యులు, చెన్నైలోని వారి స్వగృహానికి తీసుకెళ్లారు.ఆమె చెన్నైలోనే విశ్రాంతి తీసుకుంటారని ఆర్కే సెల్వమణి తెలిపారు. గత ఏడాది రోజాకు సర్జరీ చేయాల్సిన  నేపథ్యంలో అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో సర్జరీలను వాయిదా వేశారు. ఇటీవల సాధారణ పరీక్షల కోసం చెన్నై అపోలోఆస్పత్రికి వెళ్లగా,తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక పూర్తయ్యేంతవరకూ రోజా సర్జరీని వాయిదా వేయాలని కోరినప్పటికీ వెంటనే సర్జరీ అవసరమని వైద్యులు సూచించారు. దీంతో ఇక ఆస్పత్రిలో సర్జరీ చేయించుకున్నట్లు  సెల్వమణి తెలిపారు.