ఖమ్మంలో విజయమ్మ ఆశీర్వాదంతో సంకల్ప సభ


ఎప్పుడా అని ఎదురు చూసిన క్షణాలు రానే వచ్చాయి. హైదరాబాద్ లోటస్ పాండ్ నుండి వెయ్యి కార్ల భారీ కాన్వాయ్ తో  ఖమ్మం జిల్లా బయలుదేరిన  వైయస్ షర్మిల .దారిపొడుగునా జన నీరాజనం. విజయమ్మ ఆశీర్వాదంతో ఖమ్మం సభలో మొదలైన నిన్న జరిగిన సంకల్ప సభ అందరికీ తెలిసిందే. ఆ సభలో హైలెట్స్ ని మనం ఒకసారి చూద్దాం. 

        ప్రారంభ ఉపన్యాసం చేసిన విజయమ్మ తప్పకుండా జగన్ బాటలోనే షర్మిల కూడా నడుస్తుందని, తెలంగాణ ప్రజలకు నా బిడ్డ అండగా ఉంటుందని, ఈరోజు నుంచి నా బిడ్డని తెలంగాణ ప్రజల చేతుల్లోనే పెడుతున్నానని, ఇకనుంచి షర్మిలమ్మకు మీరే అండగా ఉండాలని. షర్మిల అనుకున్నది సాధించాలని, వాళ్ల నాన్న బాటలోనే నడుస్తున్నారు షర్మిలమ్మ, వాళ్ల నాన్న లాగానే పేరు తెచ్చుకోవాలని తప్పకుండా షర్మిలమ్మ కి జగన్ ఆశీర్వాదం ఉందని ఆమె చెప్పారు .

      షర్మిల మాట్లాడుతూ ఈనాడు తెలంగాణ ప్రజలు నాకు బ్రహ్మరథం పట్టారని, అందరి తరపున వైయస్సార్ అభిమానులకు, తెలంగాణ ప్రజలకు ,నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి చెల్లెమ్మకు, అక్కయ్యకు, అన్నయ్యకు, తమ్ముళ్లకు,అవ్వ కే, తాతకి ,ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈరోజు నుంచి తెలంగాణ ప్రజల సమస్యల కోసం పోరాడుదాం ,మా నాన్న బాటలో నడిచి మీ అందరి మనసులో చోటు  సంపాదిస్తారను అని అన్నారు జూన్ నెలలో  విధివిధానాలను ప్రకటిస్తాం అని, మా పార్టీ ఎవరికీ వత్తాసు పలకమని , సింహం సింగిల్ గానే వస్తుంది. ఈ నెల 15వ తారీకు  ప్రభుత్వం ఉద్యోగాలు గాని ఇవ్వకుంటే హైదరాబాద్ లో నిరాహార దీక్ష చేస్తానని,  ప్రజా సమస్యల కోసం ఇప్పుడు ఏ ప్రతిపక్ష పార్టీ లేదని మనం ప్రతిపక్ష పార్టీగా పోరాడతామని అన్నారు.ఏమైనా షర్మిల సభ విజయవంతం మహిళ  నాయకురాలిగా ఎదగడానికి ఖచ్చితంగా ఉపయోగిస్తుందని చెప్పవచ్చు. రాజశేఖర్ రెడ్డి తెగువ, ధైర్యం షర్మిలమ్మ లో కనిపించాయని జనాల మాట.