సీఎం జగన్ చంద్రబాబుకిబర్త్ డే విషెస్

     


  టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టిన రోజు,నేడు(ఏప్రిల్ 20,2021) 72వ ఏట అడుగుపెట్టారు. చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు.సీఎం జగన్ ట్విట్టర్ లో బర్త్ డే విషెస్ చెప్పారు. 'చంద్రబాబునాయుడు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుని ఆశీస్సులతో మీరు నిండు ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా' అని ట్వీట్ చేశారు.

      కరోనా వేగంగా విస్తరిస్తున్న సమయంలో తన పుట్టిన రోజు వేడుకలు ఎవరూ చేయొద్దని స్వయంగా చంద్రబాబే అభిమానులు, కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. ప్రజలంతా క్షేమంగా ఉండడమే తనకు ముఖ్యమన్నారు. కరోనాకు అంతా దూరంగా ఉండాలి అని ఆయన కోరారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు, చంద్రబాబు ఫ్యాన్స్ వరుస పోస్టులు పెడుతున్నారు.  ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉన్నారు. చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా వైసీపీ నేతలే ఎక్కవగా పోస్టులు పెడుతుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

    మెగాస్టార్ చిరంజీవి సైతం చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించారు. హార్డ్ వర్క్, క్రమశిక్షణకు మారు పేరు అయిన చంద్రబాబుకు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి.నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు .టీడీపీ అధినేతగా, ముఖ్యమంత్రిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా తెలుగు రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. అటు దేశ రాజకీయాల్లోనూ చంద్రబాబు కీలకంగా వ్యవహరించారు. 1950 ఏప్రిల్ 20న చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లెలో సాధారణ రైతు కుటుంబంలో చంద్రబాబు జన్మించారు. తిరుపతిలోని వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి బీఏ, ఎకనమిక్స్‌లో పీజీ పూర్తి చేశారు.

    కాంగ్రెస్ పార్టీలో చేరి 1978లో చంద్రగిరి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం , 28వ ఏళ్ల వయసులోనే మంత్రిగా,1981లో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కూతురు భువనేశ్వరిని పెళ్లాడారు.1983 ఎన్నికల్లో టీడీపీ గెలుపొందగా. ఆ ఎన్నికల్లో ఓడిపోయిన చంద్రబాబు అనంతరం టీడీపీలో చేరారు.1989 ఎన్నికల్లో కుప్పం నుంచి గెలుపొంది శాసన సభ ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ఎన్టీఆర్ నేతృత్వంలో 1994 ఎన్నికల్లో టీడీపీ గెలుపొందింది. అయితే ఆ ఏడాది తర్వాత అనూహ్య పరిణామాల మధ్య ఎన్టీఆర్‌ నుంచి చంద్రబాబు సీఎం పగ్గాలను చేపట్టారు.