గ్రామాల్లో ఇంటర్నెట్‌ కనెక్షన్లు, ల్యాప్‌టాప్ల్,వైయస్సార్‌ డిజిటల్‌ లైబ్రరీలు, సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ సమీక్ష

       


అన్ని గ్రామాలకు అన్‌ లిమిటెడ్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్,ఎలాంటి అంతరాయాలు లేని నెట్‌వర్క్‌ లక్ష్యం,ఏ స్పీడ్‌ కనెక్షన్‌ కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి,తద్వారా సొంత ఊళ్లలోనే వర్క్‌ ఫ్రం హోం సదుపాయం,నిర్ణీత వ్యవధిలోగా  పనులన్నీ పూర్తి చేయాలి.వైయస్సార్‌ జగనన్న కాలనీల్లోనూ ఇంటర్నెట్‌ కనెక్షన్లు,ఆ మేరకు కార్యాచరణకు సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఆదేశం.గ్రామాలకు అన్‌ లిమిటెడ్‌ కెపాసిటీతో ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉండాలి. అందు కోసం అవసరమైతే కెపాసిటీని 20 జీబీ వరకు పెంచండి. అప్పుడే వర్క్‌ ఫ్రమ్‌ హోం సులభంగా సాధ్యమవుతుంది.

     అమ్మ ఒడి పథకంలో ఆప్షన్‌గా ల్యాప్‌టాప్‌ల అందజేతపై సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ సమీక్ష జరిపారు. అప్పుడే వర్క్‌ ఫ్రమ్‌ హోం సులభంగా సాధ్యమవుతుంది.తుపాను ప్రభావిత 108 గ్రామాల్లో కూడా భూగర్భ కేబుళ్లు వేయండి. రాష్ట్ర వ్యాప్తంగా 2023 మార్చి నాటికి అన్ని గ్రామాల్లో ఇంటర్నెట్‌ కనెక్షన్ల ప్రక్రియ పూర్తి కావాలి.అమ్మ ఒడి పథకం అమలు రోజు, అంటే వచ్చే ఏడాది జనవరి 9న, ల్యాప్‌టాప్‌లు కోరుకున్న వారికి అవి అందజేయాలి.9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్ధులకు ల్యాప్‌టాప్‌పై ఆప్షన్‌ ఇచ్చిన ప్రభుత్వం. ఎక్కడైనా ల్యాప్‌టాప్‌ చెడిపోతే దాన్ని గ్రామ సచివాలయంలో ఇస్తే, దాన్ని సర్వీస్‌ సెంటర్‌కు పంపించి, వారం రోజుల్లో తిరిగి తెప్పించాలి.

     రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో, గ్రామ సచివాలయం ఉన్న ప్రతీ చోటా వైయస్సార్‌ విలేజ్‌ డిజిటల్‌ లైబ్రరీ ఉండాలి.నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం గ్రామీణ లైబ్రరీల నిర్మాణం జరగాలి. అవి పూర్తయ్యే సమయానికి అవసరమైనన్ని కంప్యూటర్లు కూడా సిద్ధం చేయాలి. వైయస్సార్‌ విలేజ్‌ డిజిటల్‌ లైబ్రరీలో న్యూస్‌ పేపర్‌ స్టాండ్‌ కూడా ఏర్పాటు చేయాలి. ఒక్కో లైబ్రరీలో 6 సిస్టమ్స్‌ ఏర్పాటు ప్రొవిజన్‌ ఉండాలి. అవసరం మేరకు 4 లేదా 6 కంప్యూటర్లు ఏర్పాటు చేసుకోవచ్చు.