ఏపీలో కరోనా నివారణ కొరకు పక్కా వ్యూహంతో మూడంచెల వ్యవస్థ సీఎం జగన్ మోహన్ రెడ్డి

 


కోవిడ్‌–19 నియంత్రణ, నివారణ చర్యల్లో మరో ముందడుగు.కోవిడ్‌ పరిస్థితులపై అధికారులతో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ సమీక్ష.కోవిడ్‌–19 కంటైన్మెంట్‌ కోసం పలు కీలక నిర్ణయాలు.పక్కా వ్యూహంతొకోవిడ్‌ మేనేజ్‌మెంట్‌లో భాగంగా మూడంచెల వ్యవస్థ ఏర్పాటు.నిరంతర పర్యవేక్షణ కోసం రాష్ట్రస్థాయిలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ కమిటీ.జిల్లా స్థాయిలో ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌. కలెక్టర్లకు మరిన్ని అధికారాలు.జాయింట్‌ కలెక్టర్‌ (డెవలప్‌మెంట్‌)కు కోవిడ్‌–19పై పూర్తి బాధ్యతలు.104 కాల్‌ సెంటర్‌ నిర్వహణ. కోవిడ్‌ ఆస్పత్రులలో వసతులు.వైద్య సేవలపై నిరంతరం నిఘా. అన్ని సేవలందేలా పర్యవేక్షణ.

     రాష్ట్రంలో కరోనా నియంత్రణ, నివారణ కోసం తొలి నుంచి పక్కా వ్యూహంతో వ్యవహరిస్తున్న ప్రభుత్వం, ఆ ప్రక్రియలో మరో ముందడుగు వేసింది. కోవిడ్‌ ఆస్పత్రుల (ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రభుత్వం టేకోవర్‌ చేసిన ప్రైవేటు ఆస్పత్రులు, కోవిడ్‌ చికిత్స చేస్తున్న ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు)లో మంచి వైద్యం, ఆక్సీజన్, ఆహారం, మందులు, నీరు, పారిశుద్ధ్యం వంటివి సక్రమంగా ఉన్నాయా? లేవా? అన్నవి చూడడం, కోవిడ్‌ రోగులకు బెడ్లు కేటాయింపు, 104 కాల్‌ సెంటర్‌ ద్వారా ఆశిస్తున్న  సేవలు అందుతున్నాయా? లేదా? అన్నది పర్యవేక్షించడం కోసం, ఇంకా ఎక్కడా ఏ లోపం లేకుండా చూడడం కోసం కొత్తగా మూడంచెల వ్యవస్థకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

    జిల్లా స్థాయి మొదలు, రాష్ట్ర స్థాయి వరకు పని చేసే మూడంచెల వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం సోమవారం రెండు ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎక్కడా కూడా నిర్దేశిత రుసుము కంటే ఎక్కువ వసూలు చేయకుండా కట్టడి చేయనున్నారు. అలాగే వైద్య సేవలనూ నిరంతరం çపర్యవేక్షించనున్నారు.జిల్లాలో కోవిడ్‌ చికిత్స చేసే ఆస్పత్రులన్నింటినీ కలెక్టర్‌ క్లస్టర్లుగా విభజిస్తారు. ప్రతి క్లస్టర్‌లో 5 నుంచి 8 ఆస్పత్రులు ఉంటాయి. ఒక్కో క్లస్టర్‌కు జిల్లా స్థాయి అధికారిని ఇంఛార్జ్‌గా జిల్లా కలెక్టర్‌ నియమిస్తారు. తరుచూ ఆ ఆస్పత్రులను సందర్శించే ఆ అధికారి, వాటిపై నిఘా వేస్తారు.

     ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎక్కువ ఫీజలు వసూలు చేయకుండా నియంత్రించడం కోసం వాటిపై తనిఖీలు చేయడం కోసం జిల్లా స్థాయిలో కలెక్టర్‌ ఒక ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ ఏర్పాటు చేస్తారు క్లస్టర్‌ ఇంఛార్జ్‌లు మరింత సమర్థంగా పని చేసేలా ఈ స్క్వాడ్‌ సహాయ సహకారాలు అందిస్తుంది. అదనంగా ఆక్సీజన్‌ ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటుతో పాటు కోవిడ్‌ ఆసుపత్రుల్లో క్షణం కూడా కరెంట్‌ పోకుండా తగిన ఏర్పాట్లు. సీటీ స్కాన్, ఆర్టీపీసీఆర్‌ టెస్టుల ధరలకు కళ్ళెం, కోవిడ్‌ నియంత్రణకు మరింత మంది వైద్యుల నియామకం.