కోవిడ్ వ్యాప్తికి పాటించవలసిన జాగ్రత్తలు ఎపి గవర్నర్ శ్రీ బిస్వ భూషన్ హరిచందన్

               


కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టడానికి పాటించవలసిన  జాగ్రత్తలు గురించి  దూరదర్శన్ సప్తగిరి చానల్ ద్వారా మే 1, 2021 తేదీన ప్రసారం కానున్న గౌరవనీయ ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్  శ్రీ బిస్వ భూషన్ హరిచందన్  గారి  విజ్ఞప్తి. ప్రసంగం.

ఆంధ్రప్రదేశ్  సోదర సోదరీమనులు అందరికి నమస్కారం.

     కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తి మొత్తం ప్రపంచానికి  సవాలుగా నిలిచింది అని మీ అందరికీ తెలిసిన విషయమే.  ప్రపంచవ్యాప్తంగా మరియు మన దేశంలో ప్రజారోగ్య పరిస్థితి అత్యంత క్లిష్టమైన పరిస్థితిని  ఎదుర్కుంటుంది . మానవజాతి  మొత్తం ఈ సంక్షోభ వలయంలో చిక్కుక్కుంది. ప్రభుత్వం చేపట్టిన  ప్రయత్నాలతో పాటు ఇటువంటి అపారమైన సవాలునుఎదుర్కోవటానికి, ఆరోగ్య శాఖ సూచించిన విధంగా ఆరోగ్య నియమాలను  ఆచరించడం , బాధ్యతాయుతంగా ప్రవర్తించడం ప్రధానంగా మన ముందున్న  కర్తవ్యం. కోవిడ్-విధాన  ప్రవర్తనను ఖచ్చితంగా పాటించాలని మరియు కరోనా వైరస్ యొక్క మరింత వ్యాప్తిని అరికట్టడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హృదయపూర్వక విజ్ఞప్తి చేస్తున్నాను.

    ఈ ఆపత్కర పరిస్తుతులలో, కోవిడ్ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాల్సిన బాధ్యత మన అందరికి ఉంది. ఈ మహమ్మారిని అధిగమించడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.కోవిడ్ -19 వైరస్ సంక్రమించే ప్రమాదం పట్ల ఎల్లప్పుడూ జాగరూకతతో ఉండాలని  నేను కోరుతున్నాను.  కరోనా  వైరస్  పట్ల  నిర్లక్ష దోరణితో ఉండే సమయం కాదని దయచేసి గుర్తుంచుకోండి.కోవిడ్ భాదితులకు వైద్య సదుపాయాలు అందించడానికి  ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది.18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు వేయడానికి ప్రభుత్వం ఇప్పుడు అనుమతి ఇచ్చింది. అర్హులైన వారందరూ ముందుకు వచ్చి వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాలని నేనుఅభ్యర్థిస్తున్నాను. వ్యాక్సిన్ తీసుకోవడం సురక్షితం మరియు కోవిడ్ -19 వైరస్ వ్యతిరేకంగా పోరాడటానికి మనకు  అందుబాటులో ఉన్న ఏకైక ఆయుధం టీకా.

    కరోనా స్వల్ప లక్షణాలు కనిపిస్తే వెంటనే 104 కాల్ సెంటర్‌కు కాల్ చేసి   తక్షణ సహాయం పొందాలని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు సహాయం చేయడానికి నిపుణులైన వైద్యులు 24 గంటలూ అందుబాటులో ఉంటారు. ఏవైనా కోవిడ్ -19 సంబంధిత లక్షణాలు గుర్తించినట్లయితే, వెంటనే ఆలస్యం చేయకుండా కరోనా పరీక్ష చేయించుకోవాలి.  అవసరమైతే, చికిత్స కోసం తక్షణ చర్య తీసుకుంటే, కరోనా వ్యాధిని నయం చేయవచ్చు. ఖచ్చితంగా పాటించాలని మరియు కరోనా వైరస్ యొక్క వ్యాప్తిని అరికట్టడానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు మరొక్కసారి  విజ్ఞప్తి చేస్తున్నాను. మనమంతా ఏకమై COVID 19 తో పోరాడి ఆ వైరస్ ను ఓడించ వచ్చు. జై హింద్.