తెలుగు జవాన్ల కుటుంబాలకు అండగా జగన్( దారుణ సంఘటన)


 రాష్ట్రానికి చెందిన విజయనగరం జిల్లా గాజులరేగకు చెందిన జవాను రౌతు జగదీష్, గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడికి చెందిన శాఖమూరి మురళీకృష్ణ,ఛత్తీస్‌గఢ్‌ ఘటనలో వీరమరణం చెందగా. ఇరు కుటుంబాలకు చెరో రూ.30లక్షలు ఇస్తున్నట్లు ప్రకటింఛిన జగన్. జవాన్ల మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని, వారి కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్నితెలియజేశారు.

      సహాయాన్ని వెంటనే అందించి బాధిత కుటుంబాలకు బాసటగా నిలవాలని సీఎంఓ అధికారులను ఆదేశించారు జగన్.చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపుర్‌లో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందగా అందులో తెలుగువాళ్లు ఉన్నారు.డిగ్రీ వరకు చదువుకున్న జగదీష్‌ 2010లో సీఆర్పీఎఫ్‌ జవాన్‌గా ఎంపికయ్యాడు. జగదీష్‌కు వచ్చే నెల 22న పెళ్లి నిశ్చమైంది. ఆ పెళ్లికోసం మరో వారం రోజుల్లో సెలవుపై రావలసి ఉంది. ఇటువంటి సమయంలో జగదీష్ మరణవార్త కుటుంబాన్ని కలచివేస్తుంది.

     మురళీకృష్ణ 2010లో సీఆర్‌పీఎఫ్‌లో జాయిన్ అవ్వగా, ఇటీవలే కొత్త ఇల్లు కట్టుకున్నారు. త్వరలో పెళ్లి చెయ్యాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఇంతలోనే మృత్యువు ఒడిలోకి చేరిపోయారు.ఇటువంటి సంఘటనలు దారుణం, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ఈ విషాద ఘటన నుంచి త్వరగా కోలుకోవాలని మా పాఠకులందరూ తరఫున ఈ దుర్ఘటన ఖండిస్తూ, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి  తెలియజేస్తున్నాము.