ఎన్వీరమణ సుప్రీంకోర్టు సీజేగా ప్రమాణస్వీకారం రేపు

     


జస్టిస్‌ ఎన్వీ రమణ రేపు సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం,న్యాయమూర్తి జస్టిస్‌ బాబ్డే పదవీకాలం ఇవాళ్టితో ముగియనుంది.రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి తర్వాత అత్యున్నత పదవి అయిన భారత ప్రధాన న్యాయమూర్తి పదవిని తెలువాడైన జస్టిస్‌ ఎన్వీ రమణ చేపట్టబోతున్నారు.. రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు.


      ప్రధాని మోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు పలువురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేబినెట్ మంత్రులు, ఎన్వీ రమణ కుటుంబ సభ్యులు హాజరవుతారు.ఏపీలోని కృష్ణాజిల్లా పొన్నవరానికి చెందిన ఎన్వీరమణ న్యాయవాదిగా జీవితాన్ని ఆరంభించి అంచెలంచెలుగా ఎదిగారు.ఏపీలో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా ఆయన పనిచేశారు.  ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమోషన్ లభించింది. అనంతరం సుప్రీంకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా జస్టిస్‌ రమణ నియమితులయ్యారు.


    రేపు సీజేగా బాధ్యతలు చేపట్టబోతున్న జస్టిస్ రమణ వచ్చే ఏడాది ఆగస్టు వరకూ ఈ పదవిలో ఉంటారు.సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో జస్టిస్ కపాడియా తర్వాత అత్యధిక కాలం ఈ పదవిలో ఉండే సీజేగా కూడా జస్టిస్‌ రమణ గుర్తింపు పొందనున్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యక్తి ఎన్.వి.రమణ, రేపు సుప్రీంకోర్టు సీజేగా ప్రమాణం చేయుచున్న సందర్భంగా ప్రతి తెలుగు వాడు గర్వించదగ్గ విషయం. తెలుగువాడి కీర్తి ప్రతిష్ఠలు మరొక్కసారి ఢిల్లీలో వెలుగొందిన ఎన్.వి.రమణ, పేద ప్రజల వైపు నిలబడి ఈ రాష్ట్రానికి ఆదర్శం కావాలని  తెలుగు ప్రజలందరి తరపున ఎన్.వి.రమణ ఆల్ ది బెస్ట్.