అవార్డుల కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని శ్రీ నరేంద్రమోదీ ప్రారంభించారు

     


జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా జాతీయ స్థాయిలో అవార్డులు పొందిన పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు పురస్కారాలుఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని శ్రీ నరేంద్రమోదీ ప్రారంభించారు.అనంతరం సీఎం శ్రీ వైయస్‌ జగన్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రకటించిన జాతీయ స్థాయి అవార్డులను ప్రదానం చేశారు. గత ఏడాది (2020)లో రాష్ట్రానికి 15 అవార్డులు రాగా, ఈసారి మొత్తం 17 అవార్డులు వచ్చాయి.ఆంధ్రప్రదేశ్‌కు నాలుగు కేటగిరీలలో మొత్తం 17 అవార్డులు.

   


ఈ–పంచాయత్‌ కేటగిరీలో రాష్ట్రస్థాయి రెండో అవార్డుతో పాటు, జిల్లా స్థాయిలో 2, మండల స్థాయిలో 4, పంచాయతీ స్థాయిలో 10 జాతీయ అవార్డులు ఈ ఏడాది (2021) రాష్ట్రానికి దక్కాయి.జిల్లా స్థాయి అవార్డు కింద రూ.50 వేలు, మండల స్థాయి అవార్డు కింద రూ.25 వేలు, పంచాయతీ స్థాయిలో జనాభాను బట్టి రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు నగదు బహుమతి ఇస్తారు.. ఈ  కార్యక్రమంలో కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌తో పాటు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరయ్యారు.

    ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ, కోవిడ్‌ కష్టకాలంలోనూ గ్రామ పంచాయతీలు గత ఏడాది నుంచి చాలా చక్కగా పని చేస్తున్నాయని, ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉన్నందున, పంచాయతీలు అదే స్ఫూర్తితో పని చేయాలని, కోవిడ్‌ మహమ్మారికి సమర్థంగా ఎదుర్కోవడం గ్రామ పంచాయతీలలోనే ఆరంభం కావాలని ఆకాంక్షించారు.ఈ–పంచాయత్‌ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్‌ పొందిన రాష్ట్రస్థాయి రెండో అవార్డును పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ది కమిషనర్‌ ఎం.గిరిజాశంకర్‌కు అవార్డును ప్రదానం చేసిన సీఎం శ్రీ వైయస్‌ జగన్, ఆ తర్వాత జిల్లా, మండల, పంచాయతీల అవార్డులు ఇచ్చారు.