గౌరవ రాయ్ దేశ ప్రజలందరి తరపున నీకు సెల్యూట్

   


 చంపేస్తోంది కరోనా మహమ్మారి లక్షల సంఖ్యలో ఆక్సిజన్ అందక అత్యధిక మంది మరణిస్తున్నారు. తోటి మనిషికి సహాయం చేయడం మరిచిపోయి,.పాట్నాకు చెందిన 52 ఏళ్ల గౌరవ్ రాయ్ఆక్సిజన్ సిలిండర్లను అందిస్తున్నాడు..వందల సంఖ్యలో రోగులును కాపాడుతున్నాడు. అందుకే అతడిని అందరూ 'ఆక్సిజన్ మ్యాన్'గత సంవత్సరంలొ గౌరవ్ కూడా కరోనా బారిన పడ్డారు. అయితే,ఆసుపత్రిలో అడ్మిట్ కావడానికి బెడ్ దొరకలేదు.మెట్ల పక్కనే ఉండిపోయాడు. అక్కడే తిండి..నిద్ర. కానీ..అతనికి ఆక్సిజన్ లెవల్స్ పడిపోయాయి.

      ఆక్సిజన్ సిలిండర్ పెట్టాల్సిన పరిస్థితి. ఆసుపత్రిలో ఒక్క సిలిండర్ కూడా దొరకలేదు. గౌరవ్ భార్య అవస్థలు పడిఓ ఆక్సిజన్ సిలిండర్ ను ఏర్పాటు చేశారు. గౌరవ్ నెమ్మదిగా కోలుకుని వైరస్ బారి నుంచి బయటపడ్డాడు.రక్క పడుతున్న ఇబ్బందులను స్వయంగా చూశాడు. ఆరోగ్యవంతంగా అయిన తర్వాత..ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు గౌరవ్ దంపతులు.సొంత డబ్బులతో ఇంటి బేస్ మెంట్ లో చిన్న ఆక్సిజన్ బ్యాంకును ఏర్పాటు చేశారు. తన దగ్గరున్న వ్యాగ్నర్ కారులో ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకుని,అవసరం ఉన్న వారికి అందచేయడం ప్రారంభించారు. 

    అవసరం ఉన్న వారు గౌరవ్ కు ఫోన్ చేసేవారు. సిలిండర్లను ఉచితంగా ఇచ్చి,ఆ పేషెంట్ కోలుకున్నాక,మరలా ఆ సిలిండర్ ను వెనక్కి తీసుకొచ్చేవారు. గౌరవ్ ఒక్క రూపాయి కూడా తీసుకోకపోవడంపది సిలిండర్లతో ప్రారంభమై..నేడు..200 సిలిండర్ల స్థాయికి చేరుకుంది. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది..గౌరవ్ ను మెచ్చుకున్నారు. అంతేకాదు..తమకు తోచిన విధంగా విరాళాల రూపంలో గౌరవ్ కు సాయం చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 950 మందికి సిలిండర్లను సరఫరా చేసినట్లు సమాచారం.గౌరవ రాయ్ దేశ ప్రజలందరి తరపున నీకు సెల్యూట్.