SPREADNEWS;- మొదటి విడత లోనే కాదు రెండవ విడతలో కూడా కరోనాను ఎదుర్కొనడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు అని ప్రశంసించారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఈరోజు విశాఖపట్నం లోని మూడువందల పడకల ఆసుపత్రి ప్రారంభం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రధాని మాదిరిగానే జగన్ మోహన్ రెడ్డి కూడా ఒక లక్ష్యం ఉన్న నాయకుడు అని, ఈ ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి వైపు నడిపిస్తున్నాడని, ఇతర రాష్ట్రాలు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేసిన ధర్మేంద్ర ప్రధాన్. ఇంకా అనేక విషయాలలో ఏపి రాష్ట్రం అనేక రాష్ట్రాలుగా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.
విశాఖపట్నంలో ఆర్ఐఎన్ఎల్ ఆధ్వర్యంలో కోవిడ్ రోగుల చికిత్స కోసం 1000పడకల ఆస్పత్రి నిర్మితమయ్యింది. అయితే ఫేజ్-1 లో భాగంగా 300 పడకల సామర్థ్యం గల హాస్పిటల్ అందుబాటులోకి వచ్చింది. కేంద్ర న్యాచురల్ గ్యాస్, పెట్రోలియం, ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వర్చువల్ గా ఈ హాస్పిటల్ ను ప్రారంభించనున్న ఏపీకి అంకితమిచ్చారు.