అందరికీ వ్యాక్సిన్అనిల్ కుమార్ సింఘాల్

     


SPREADNEWS(AMRAVATHI);- రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ వేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. కొవిడ్ నివారణలో విధులు నిర్వర్తిస్తున్న తాత్కాలిక పారామెడికల్ సిబ్బందికి వెయిటేజ్ మార్కులు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీచేసిందన్నారు. జిల్లా కలెక్టర్ల నుంచి అనుమతులు పొందిన ప్రైవేటు ఆసుపత్రులను ఆరోగ్య శ్రీ పథకం కిందకు తీసుకొచ్చిన్నట్లు ఆయన వెల్లడించారు. ఆ ఆసుపత్రుల్లో కూడా ఆరోగ్య శ్రీ కింద వైద్యసేవలు ఇకపై అందుతాయన్నారు. 

      45 ఏళ్లకు పైబడిని వారికే రెండు డోసులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపిందన్నారు. మంగళిగిరిలోని ఏపీఐఐసీలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,05,494  కరోనా టెస్టుల చేయగా, 22,164 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు.. ఆరోగ్య శ్రీ పథకం కింద సేవలు పొందే రోగులకు అన్ని ఆసుపత్రుల్లోనూ అడ్మిషన్లు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 637 ఆసుపత్రుల్లో కరోనా వైద్య సేవలు అందిస్తున్నారన్నారు.

     ఆయా ఆసుపత్రుల్లో ఐసీయూ బెడ్లు 6,870 ఉన్నాయని, వాటిలో 6,323 బెడ్లు రోగులతో నిండాయని, ఇంకా 547 బెడ్లు ఖాళీ గాఉన్నాయని తెలిపారు. వాటిలో కర్నూలులో అత్యధికంగా 281 బెడ్లు ఖాళీ ఉన్నాయన్నారు.కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు రాష్ట్ర ప్రభుత్వం ఆక్సిజన్ సరాఫరా రోజు రోజుకూ పెంచుతోందన్నారు. 330 టన్నులతో ప్రారంభమైన సరఫరా నేటికి 560 టన్నులు వరకూ పెరిగిందన్నారు.  ఆక్సిజన్ సరఫరా పెంచాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వినతిని మన్నిస్తూ కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చే కోటాను పెంచిందన్నారు.రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్ వేస్తామని, అందరూ ఓపికతో ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.