ప్యూర్ స్మైల్ సేవా సంస్థ మరో సేవకు శ్రీకారం

      


SPREAD NEWS(NELLORE);- ప్యూర్ స్మైల్ సేవా సంస్థ స్థాపించి నాలుగు సంవత్సరాలు దిగ్విజయంగా మీ సేవలో కొనసాగింది. మా సంస్థ ధ్యేయం కులమతాలకు అతీతంగా ప్రజాసేవ. ఈ సంస్థ వృద్ధులకు, వికలాంగులకు, మంచం మీద నుండి లేవలేని స్థితిలో ఉన్న రోగులకు ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ అందించి, వాళ్లను ఆదుకోవడంలో ముందుంది. అదేవిధంగా కులమతాలకు సంబంధం లేకుండా ప్రతి పండగలకు పేదవారికి కొత్త బట్టలు, నిత్యావసర వస్తువులు, అందిస్తూ ఉంటుంది. అదేవిధంగా రంజాన్ పండుగ సందర్భంగా పెన్షన్ దారులకు పెన్షన్ తో పాటు, వారికి కొత్త బట్టలు, నిత్యవసర వస్తువులు, అందించారు. ఈ కార్యక్రమంలో సమస్త నిర్వాహకురాలు పర్వీన్ సభ్యులు స్వర్ణ, లలిత, పాల్గొనడం జరిగింది. ఈ సంస్థ ఇంకా ఎత్తుకెదిగి అనేక సేవా కార్యక్రమాలతో ముందుండాలని కోరుకుందాం.